బీజేపీపై బాబుకు ఆశ‌లు పోయిన‌ట్టేనా…?

February 19, 2020 at 11:09 am

ఈ రోజు కాక‌పోతే.. రేపు.. రేపు కాక‌పోతే.. క‌నీసం 2024 ఎన్నిక‌ల నాటికైనా.. త‌న‌తో చేతులు క‌లుపుతుంది.. త‌న‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వ‌స్తుంద‌ని టీడీపీ అదినేత చంద్ర‌బాబు బీజేపీపై కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ పార్టీతో లోపాయికారీగా అయినా సంబంధాలు నెర‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు త‌న పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లిన‌ప్ప‌టి నుంచి బాబు బీజేపీ పెద్ద‌ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది.. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌న్‌.. సో.. మ‌నం మ‌ళ్లీ చేతులు క‌లుపుదాం! అంటారేమోన‌ని, ఫోన్ చేసి మాట్లాడ‌తారేమోన‌ని ఎదురు చూస్తున్నా రు.

అయితే, అలాంటి ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. పైగా.. జ‌గ‌న్‌కు స‌న్నిహిత‌మ‌య్యేందుకు బీజేపీ పెద్ద‌లు ప‌రోక్షంగా పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అడిగిన వెంట‌నే అప్పాయింట్‌మెంట్ల ను ఖ‌రారు చేస్తున్నారు. గంట‌ల‌కొద్దీ కాలం ఆయ‌న‌తో గ‌డుపుతున్నారు. ముఖ్యంగా శాస‌న మండ‌లి ర‌ద్దు విష‌యంలో జ‌గ‌న్‌కు పూర్తిగా స‌హ‌క‌రించేందుకు కూడా కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు సిద్ధ‌మైన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. బీజేపీ చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం క‌న్నా.. మంచో చెడో .. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మే బెట‌ర్ అని భావిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. మ‌రోప‌క్క‌, ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు చంద్ర‌బాబు మూలాల‌పై దెబ్బ‌కొట్టే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం బాబుకు మ‌రింత‌గా ఇబ్బంది పెడుతున్న తాజా అంశం. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న కాలంలో ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన అధికారి ఇంటిపై దాడులు చేయ‌డం, ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సీజ్ చేయ‌డం.. వంద‌ల సంఖ్య‌లో ప‌త్రాలు స్వాధీనం చేసుకోవ‌డం, రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేగడం వంటి ప‌రిణామాలు చంద్ర‌బాబు ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించిన‌ట్టు అయింది.

నిజానికి ఐటీ దాడులు అనేవి కేంద్రం క‌నుస‌న్న‌ల్లో జ‌రిగేవే. దీంతో కేంద్ర‌మే ఇప్పుడు చంద్ర‌బాబును టార్గెట్ చేస్తోందంటే.. రాబోయే రోజుల్లో బీజేపీతో ఆయ‌న క‌లిసే స‌మ‌స్యే ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

బీజేపీపై బాబుకు ఆశ‌లు పోయిన‌ట్టేనా…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts