గ‌తాన్ని మార్చే క్ర‌మంలో బాబు..?

February 15, 2020 at 11:53 am

గతం గ‌తః- ఈ సూత్రం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కే కాదు..రాజ‌కీయాల్లో ఉన్న వారికి కూడా సంపూర్ణంగా వ‌ర్తించే సూత్రం. గ‌తాన్ని మ‌రిస్తేనే భ‌విష్య‌త్తు.. అనే నినాదాన్ని ఇప్పుడు టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర బాబు కూడా పాటిస్తున్నారు. దీనినే ఆయ‌న ప్ర‌చారం చేస్తున్నారు. “ప‌దండి ముందుకు.. ప‌దండి తోసుకు.. ప‌దండి పోదాం.. లోక‌ల్‌కు!“ అనే నినాదంతో చంద్ర‌బాబు ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బాబు పెట్టుకున్న ప్లాన్ అద్భుతంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఇది సాకారం అయ్యేనా? అనేదే ఇప్పుడు పెద్ద ప్ర‌దాన డౌట్‌గా మారిపోయింది.

చంద్ర‌బాబు త‌న హ‌యాంలో .. గ‌తంలో ఉన్న‌త ప‌ద‌వులు ఇచ్చి..ప్రాధాన్యం క‌ల్పించిన వారిలో చాలా మం ది ఇప్పుడు క‌నీసం తెర‌మీద‌కి కూడా రావ‌డం లేదు. అదేస‌మ‌యంలో ఆనాడు.. మాకు ప‌ద‌వులు ఇవ్వండి.. మేం పార్టీ కోసం కొన్ని ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తున్నాం.. అని ప్రాధేయ ప‌డినా.. ప‌ట్టించుకోకుండా వారిని ప‌క్క‌న చంద్ర‌బాబుకు ఇప్పుడు వారే పెద్ద‌దిక్కుగా పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్రారంభిస్తున్న ప్ర‌జా చైత‌న్య యాత్ర‌ల‌కు పాత‌వారు క‌లిసివ‌స్తారా? గ‌తంలో నెల‌కొన్న పొర‌పొచ్చాల‌ను ఆయ‌న ప‌రిష్క‌రిస్తారా? అనేది కీల‌కంగా మారింది.

అదేస‌మ‌యంలో మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న చంద్ర‌బాబుకు ఉత్త‌రాంధ్ర‌లో వ్య‌తిరేక‌త రావ డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదేవిధంగా తూర్పులోనూ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మూడు రాజ‌ధానుల‌ను స్వాగ‌తిస్తున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు. గ‌తాన్ని మ‌రి చిపోయేలా.. త‌మ్ముళ్ల‌ను క‌లుపుకొని వెళ్ల‌డంలో ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారు? అనేది ఆస‌క్తిగా మారిం ది. అదేస‌మ‌యంలో త‌మ్ముళ్ల మ‌ధ్య నెల‌కొన్ని ఆదిప‌త్య పోరు కూడా బాబుకు స‌వాల్ రువ్వుతోంది. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు చేప‌ట్టనున్న ప్ర‌జా చైత‌న్య యాత్ర ఏవిధంగా ముందుకు సాగుతుందో .. ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయో చూడాలి.

గ‌తాన్ని మార్చే క్ర‌మంలో బాబు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts