ఎన్టీఆర్ కి ఓకే.. చరణ్ ఇంకా డిసైడ్ కాలేకపోతున్నాడా?

February 20, 2020 at 10:57 am

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇద్దరు హీరోలు ఏ డైరక్టర్‌తో సినిమా చేయనున్నారనే ఆసక్తి వారి అభిమానుల్లో నెలకొంది. ఇలాంటి తరుణంలోనే ఎన్టీఆర్ నుంచి ఓ బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.

అన్న కల్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుందనే ప్రకటన కూడా వచ్చింది. అయితే తారక్ నెక్స్ట్ సినిమా ప్రకటించడంతో ఇప్పుడు అందరి కళ్ళు చరణ్ మీద పడ్డాయి. చరణ్ నెక్స్ట్ సినిమా ఏ డైరక్టర్‌తో చేస్తాడు. ఆ సినిమా ఎప్పుడు ప్రకటిస్తారని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే చరణ్ ఇప్పటికే హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు చెప్పిన లైన్స్ విన్నారని తెలుస్తుంది. కానీ వీళ్లందరి కంటే కూడా రేస్‌లో సుజీత్ ముందున్నాడని, సాహో సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయిన సుజిత్‌తో ఓ సూపర్ యాక్షన్ సినిమా తీసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరి చూడాలి చరణ్ తన తదుపరి సినిమా ఎవరితో నటిస్తాడో?

ఎన్టీఆర్ కి ఓకే.. చరణ్ ఇంకా డిసైడ్ కాలేకపోతున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)