మెగాస్టార్ సినిమాలో మోహన్ బాబు…క్లారీటీ వచ్చింది

February 13, 2020 at 10:31 am

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మోహన్ బాబు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే చిరంజీవి సినిమాలో మోహన్ బాబు నటించడం లేదంటూ చిత్ర యూనిట్ క్లారీటీ ఇచ్చింది. తమ సినిమాలో ఆయనకు తగ్గ పాత్ర లేదని, ఒకవేళ ఉంటే ఆయన్ని తప్పకుండా సంప్రదించేవాళ్లం కదా అని చెప్పారు.

త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక కొరటాల శివ ఈ సినిమాని దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపు ఐదారు కిలోల వరకు బరువు తగ్గాడు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ సినిమాలో మోహన్ బాబు…క్లారీటీ వచ్చింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts