చిరంజీవి అల్లుడు ముచ్చటగా మూడోది ..!

February 28, 2020 at 10:57 am

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడకపోయిన కల్యాణ్‌కు మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక విజేత చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కల్యాణ్… పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న ‘సూపర్ మచ్చి’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు. మిగిలిన పాటలను వచ్చే నెలలో గోవాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ చిత్రంతో పాటు మరో చిత్రంలో కూడా నటించేందుకు కల్యాణ్ సిద్ధమైన విషయం తెలిసిందే. రచయిత ‘శ్రీధర్ సీపాన’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి 12న నుండి ప్రారంభం కానుంది. ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరంజీవి అల్లుడు ముచ్చటగా మూడోది ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts