చిరంజీవి బిజీ…ఖాళీగా ఉన్నవాళ్లకే ఆ పదవి!

February 7, 2020 at 6:53 pm

తెలుగుచిత్రసీమలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగి దాదాపు ఏడు,ఎనిమిదేళ్లు అవుతుంది. ఉమ్మడి ఏపీ విడిపోయాక ఈ నంది అవార్డులు పక్కకు వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల చిరంజీవీ, నాగార్జునలు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయి నంది అవార్డుల గురించి చర్చించినట్లు తెలిసింది.

అయితే వారి చర్చ కంటే ముందే చిరంజీవిని నంది అవార్డుల కమిటీకి చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జరుగుతూ వాటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై టాలీవుడ్ నిర్మాత, క్రిటిక్ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవికి నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయని, అయితే చిరంజీవి స్థాయికి ఆ పదవి చాలా చిన్నదని చెప్పారు. అసలు అలాంటి చైర్మన్ పదవుల్లో ఖాళీగా ఉన్నవాళ్లే ఉంటారని అన్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఎంతో బిజీగా ఉండే వ్యక్తి అని, పైగా ఏదైనా సమస్య వస్తే దాన్ని చిరంజీవిపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతాయని కూడా అన్నారు. కాబట్టి చిరంజీవికి అలాంటి పదవి అక్కర్లేదని, అయిన ఆయన టాలీవుడ్‌లో సుప్రీం స్థాయిలో ఉన్నారని అన్నారు.

చిరంజీవి బిజీ…ఖాళీగా ఉన్నవాళ్లకే ఆ పదవి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts