దిల్ రాజు పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ తోనేనా ?

February 13, 2020 at 11:23 am

గత కొన్నిరోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన రాకపోయినా, తాను చేసుకునే అమ్మాయి మాత్రం ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. దిల్ రాజు భార్య అనిత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఇక భార్య చనిపోవడం, కూతురు పెళ్లి కూడా అయిపోవడంతో రాజు ఒంటరి అయిపోయాడు.

దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో రాజు కూడా ఆ వైపుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబనికి దగ్గర మనిషి అయిన పెళ్లికాని ముప్పై ఏళ్ల మహిళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి..గతంలో కొన్నాళ్లు ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని తెలిసింది. ఇక మరోవైపు ఈ పెళ్లికి దిల్ రాజు కూతురు కూడా ఒప్పుకుందని.. దాంతో దిల్ రాజు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఫిబ్రవరిలోనే ఈయన పెళ్లి జరగాల్సి ఉన్నా కూడా అనివార్య కారణాలతో కొన్ని రోజులు వాయిదా పడినట్లు సమాచారం.మరొకపక్క టాలీవుడ్ స్టార్ హీరోయిన్ని పెళ్లిచేసుకోబోతున్నాడని సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

దిల్ రాజు పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ తోనేనా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts