ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి రెండో పెళ్లి …?

February 10, 2020 at 3:09 pm

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటారనే వార్త ఇప్పుడు టాలివుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా వినపడుతుంది. మూడేళ్ళ క్రితం ఆయన భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. అదే విధంగా ఆయన కుమార్తె కు కూడా వివాహం అయిపోయింది. ఈ నేపధ్యంలో ఈ స్టార్ నిర్మాత తనకు తోడు కావాలని భావిస్తున్నారట.

పెళ్లి కూతురు కూడా దొరికిందని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిని ఆయన వివాహం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం టాలివుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ విషయం తన సిని సన్నిహితులకు మాత్రమె చెప్పారట. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఈ వార్త టాలివుడ్ లో చక్కర్లు కొడుతుంది. దిల్ సినిమా తర్వాత ఆయన స్టార్ నిర్మాత అయిపోయారు.

కెరీర్ పరంగా సిని పరిశ్రమలో టాప్ 3 నిర్మాతల్లో ఆయన ఒకరు అంటారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పింక్, నాని తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు రెండు వేసవిలో విడుదల కానున్నాయి. ఆ తర్వాత ఆయన వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం, లేక సోషల్ మీడియా పుకారా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి రెండో పెళ్లి …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts