జీవీఎల్‌కు విజయసాయి సపోర్ట్

February 10, 2020 at 10:53 am

ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు…ఏపీ రాజధానిపై పలుమార్లు స్పందిస్తూ..కేంద్రం రాజధాని విషయంపై కలుగజేసుకోదని, రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని చాలాసార్లు మీడియా ముందు చెప్పారు. అయితే జీవీఎల్ వ్యాఖ్యలపై మాత్రం టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జీవీఎల్ వైసీపీకి మద్ధతుదారుడుగా ఉన్నారని అంటున్నారు. అటు కొన్ని మీడియాల్లో కూడా జీవీఎల్ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే జీవీఎల్‌కు మద్ధతుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని పార్లమెంటులో సంబంధిత మంత్రి వెల్లడించారని, అది రాష్ట్రాలకున్న ప్రత్యేక హక్కు అని, ఎల్లో మీడియా మాత్రం కేంద్రం ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటోందని, దీనిపై వివరణ ఇచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు.

ఇక మండలి రద్దు విషయంలో కూడా కేంద్రం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన మండలి రద్దు బిల్లుని ఆమోదించే అవకాశముందని జీవీఎల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తానికి మూడు రాజధానుల ఏర్పాటు, మండలి రద్దు విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

జీవీఎల్‌కు విజయసాయి సపోర్ట్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts