విశ్వక్ సేన్ ‘హిట్‌’ రివ్యూ &రేటింగ్

February 28, 2020 at 12:43 pm

టైటిల్‌: హిట్‌
నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ..
నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని
దర్శకత్వం: శైలేష్ కొలను
సినిమాటోగ్రఫీ: మణి కందన్
మ్యూజిక్: వివేక్ సాగర్

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ‘అ!’ విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాక‌పోయినా
మరోసారి నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమా దాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `హిట్‌`. `ది ఫ‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. నూతన దర్శకుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపుర‌నేని నిర్మించిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా ? లేదా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

హిట్ క‌థ :
‘హిట్’ కథ విషయానికొస్తే… విక్రమ్ రుద్రరాజు(విశ్వక్ సేన్) క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆఫీసర్. అయితే రుద్రరాజు క్రైమ్ కేసులని ఛేదించే క్రమంలో ప్యానిక్ అటాక్ అనే డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. ఇక ఈ విధంగా నడుస్తున్న రుద్రరాజు జీవితంలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. తను ప్రేమిస్తున్న అమ్మాయి రుహాని శర్మ హఠాత్తుగా మిస్సయిపోతుంది. రుహానితో పాటు ప్రీతీ అనే అమ్మాయి కూడా మిస్సవుతుంది. దీంతో హీరో రెండు మిస్సింగ్ కేసులని ఛేదించే పనిలో పడతాడు. ఇక రుద్రరాజు ఆ కేసులని ఎలా ఛేదించాడు? మిస్సింగ్ కేసులని ఛేదించే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరుగతాయి? చివరికి ఏం అవుతుందనేది థియేటర్లలో చూడాల్సిందే.

TJ విశ్లేష‌ణ :
అటు సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి సీన్‌లోనూ ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. క్రైమ్ థ్రిల్లర్‌లని ఇష్టపడేవారు…ఆ సీన్లని మరింత ఇష్టపడతారు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ హైలైట్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ ఎలా నడిచిందో సెకండాఫ్ కూడా అదే ఫ్లో లో వెళుతుంది. ఎక్కడ ప్రేక్షకుడుకు థ్రిల్ మిస్ అవ్వదు. అలాగే సెకండాఫ్‌లోనే హీరో గతం ఏంటనేది సింపుల్‌గా చూపించేస్తాడు. మొత్తానికైతే చివరి వరకు బోర్ లేకుండా లాగించేస్తారు. ఇక నటీనటులు విషయానికొస్తే…విశ్వక్ నేచురల్ నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో విశ్వక్ నటన చాలా బాగుంది. అటు హీరోయిన్ రుహాని శర్మ కూడా తన పాత్ర వరకు మంచి నటనను కనబర్చింది. విశ్వక్ సేన్ మైండ్ బ్లోయింగ్ నటనతో ప్రేక్షకులతో ఏం చేసిండు మామా.. మస్త్ చేసాడు అనిపించేలా న‌టించాడు.

ఈ సినిమా విశ్వ‌క్‌సేన్‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్కరించింది. ‘చిలసౌ’ ఫేమ్ రుహాని శర్మ ఉన్నంతలో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. విశ్వక్ సేన్ – రుహాని శర్మల లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఈ సీరియస్ థ్రిల్లర్ లో వీరిద్దరి లవ్ ట్రాక్ ద్వారా ఆడియన్స్ కి కొన్ని నవ్వులు పంచారు. భాను చందర్, మురళి శర్మ, హరితేజ తదితర నటీనటులు వారి వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. సీనియర్ నటులు మురళీ శర్మ, బ్రహ్మాజీలు ఉన్నంత వరకు బాగా చేశారు.

అసలు సినిమాకు మెయిన్ హైలైట్ ఎవరంటే దర్శకుడు శైలేష్ అనే చెప్పుకోవచ్చు. ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. అలాగే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తీయడంలో సఫలమయ్యాడు. అటు వివేక్ సాగర్ అందించిన సంగీతం అద్భుతమనే చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తను ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్. అయితే స్టోరీలో కొన్ని చోట్ల సీరియస్‌నెస్ మిస్ అవ్వడం, కమర్షియల్ హంగులు లేకపోవడం, ఎంటర్టైన్మెంట్ కూడా సరిపడనంత లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. మొత్తం మీదైతే క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ‘హిట్’ సినిమా హిట్ కొట్టినట్లే.

ఫైన‌ల్‌గా…
టాలీవుడ్లో ఇటీవ‌ల ప‌ర్‌ఫెక్ట్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్ పెరుగుతోంది. క్ష‌ణం, ఎవ‌రు త‌ర‌హాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రించేందుకు రెడీగా ఉన్నారు. ఇక హిట్ ఏ సెంటర్, మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చుతుంది. మ‌రి బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఎంత వ‌ర‌కు కనెక్ట్ అవుతుందో ? చూడాలి.

ఫైన‌ల్ పంచ్ : ఏ క్లాస్ హిట్‌

హిట్ TJ రేటింగ్ : 3.0 / 5

విశ్వక్ సేన్ ‘హిట్‌’ రివ్యూ &రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts