హైపర్ ఆదికి ‘అదిరింది’పంచ్ !

February 28, 2020 at 10:26 am

జబర్దస్త్‌లో బాగా ఆకట్టుకునే స్కిట్స్ ఎవరివి అంటే అందరూ ఠక్కున హైపర్ ఆది పేరు చెప్పేస్తారు. మిగతా వాళ్ళ స్కిట్లు కూడా బాగున్న ఆది స్కిట్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. తను వేసే పంచ్‌లకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తాయి. ఆదికి వచ్చినట్లుగా మిగతా జబర్దస్త్ టీం లీడర్ల స్కిట్లకు వ్యూస్ రావు. అయితే సొంత జబర్దస్త్ నుంచి ఆదికి పోటీకి లేకపోయిన, జీ తెలుగులో వచ్చే అదిరింది ప్రోగ్రాం నుంచి అయితే గట్టి పోటీ వచ్చినట్లే కనిపిస్తుంది.

ఏడేళ్లుగా జబర్దస్త్‌లో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు, ఇటీవల జీ తెలుగుకు వెళ్ళిపోయి అదిరింది ప్రోగ్రాంతో వేరు కుంపటి పెట్టిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలు, పాత జబర్దస్త్ టీమ్స్ ధనరాజ్, వేణులు కూడా ఆ ప్రోగ్రాంలోకి వచ్చారు. అయితే ఎంతమంది సీనియర్ టీం లీడర్లు ఉన్న అదిరింది మాత్రం, జబర్దస్త్‌కు పోటీ ఇవ్వలేకపోతుంది. కానీ ‘గల్లీ బాయ్స్’ పేరిట అదిరింది ప్రోగ్రాంలో ‘పటాస్’ ఫేమ్ కుర్రాళ్ళు సద్దాం, యాదమ్మ రాజు, భాస్కర్‌లు అదరగొడుతున్నారు.

వీరి స్కిట్లలో పెద్ద పెద్ద పంచ్‌లు లేకపోయిన, వారు అప్పటికప్పుడు చేసే నేచురల్ యాక్టింగ్‌కి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఆదికి వచ్చినట్లుగానే వారి స్కిట్లకు కూడా మంచి ఆదరణ వస్తుంది. మొత్తానికైతే యూట్యూబ్‌లో గల్లీ బాయ్స్ టీం..హైపర్ ఆదికి గట్టి పోటీ ఇస్తుంది.

హైపర్ ఆదికి ‘అదిరింది’పంచ్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts