శర్వానంద్ ,సమంత ‘జాను ‘ రివ్యూ & రేటింగ్

February 7, 2020 at 10:41 am

టైటిల్‌: జాను
నటీనటులు: సమంత, శర్వానంద్
సినిమాటోగ్రఫీ: మహేందిరన్ జయరాజ్
మ్యూజిక్: గోవింద్ వసంత
నిర్మాత: దిల్ రాజు – శిరీష్
దర్శకత్వం: ప్రేమ్ కుమార్

సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన సినిమా జాను. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. జాను సినిమా గురించి చాలా రోజులుగా తెలుగులో కూడా చర్చ జరుగుతుంది. తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు ఇది రీమేక్. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్కడ ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ఇదే సినిమాను జాను పేరుతో రీమేక్ చేశాడు ప్రేమ్ కుమార్. నిజానికి 96 విడుదలకు ముందే ఈ సినిమాను చూసి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు దిల్ రాజు. ఇక్కడ శర్వానంద్, సమంతతో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదలైంది. మనసును తాకే సన్నివేశాలకు తోడు అందమైన సంగీతం 96 సినిమాకు ప్రత్యేకత. మ‌రి ఈ రోజు తెలుగులో జానుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
జాను కథ విషయానికొస్తే….వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్(శర్వానంద్) తన కెరీర్‌ని ఓ వైపు నడిపించుకుంటూనే, కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తను చదువుకున్న స్కూల్‌కు వెళతాడు. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితులు గెట్ టు గెదర్‌కు ప్లాన్ చేయడం, అక్కడకి తన చిన్ననాటి క్రష్ జాను(సమంత) రావడం, ఆ తర్వాత వారి చిన్ననాటి లవ్ స్టోరీ ఎలా నడిచింది. తర్వాత గెట్ టు గెదర్ అయిపోయాక వీరు మధ్య ఎలాంటి స్టోరీ నడిచింది. స్కూల్‌లో మొదలైన వీరి ప్రేమ చివరికి ఎలా ?ముగిసిందనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడాలసిందే.

TJ విశ్లేష‌ణ :
ఈ సినిమా విశ్లేష‌ణ విష‌యానికి వ‌స్తే తమిళ్‌లో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్ గా వచ్చిన జాను ఏ విధంగా ఆకట్టుకుంది అనే ప్రశ్న ఎదురైతే..తమిళ్ 96కు ఏ మాత్రం తీసిపోకుండానే జాను తెరకెక్కించారనే చెప్పొచ్చు. దర్శకుడు సి ప్రేమ్ కుమార్ 96‌ని ఎలా రూపొందించారో…అలాగే జానుని చిత్రీకరించారు. ఇక విజయ్ సేతుపతి, త్రిషల స్థానలో తెలుగులో చేసిన శర్వానంద్, సమంతలు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. అలాగే వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అయితే బాగా ఆకట్టుకుంటాయి.

స్పెషల్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్, చూస్తున్న అందరి కళ్ళు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. ఆ కన్నీటికి సగం కారణం సమంత అయితే, సగం కారణం మీ గుండె లోతుల్లో దాగిఉన్న తొలిప్రేమ అనుభూతుల్ని గుర్తొచ్చేలా చేయడమే. ఓవరాల్ జాను పాత్ర, జానుగా సమంత మనల్ని కట్టి పడేస్తారు. అటు ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ పాత్రల్లో చేసిన వారు కూడా మెప్పించారు. శర్వా, సామ్‌ల ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని సినిమాకు తగ్గట్టుగా చేశారు.

ఇక ఈ ఫీల్ గుడ్ సినిమాకు గోవింద్ వసంత అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని మరింత హైలైట్ చేసాయనే చెప్పొచ్చు. అయితే కథ పరంగా చాలా అద్భుతంగా ఉన్న సినిమా స్క్రీన్ ప్లే మాత్రం చాలా స్లోగా సాగడం వల్ల, అక్కడక్కడ బోరు కొట్టే అవకాశం ఉంది. ఇక ఎలాగో సినిమా కమర్షియల్ కాదు కాబట్టి…మాస్ ఆడియన్స్‌కు సినిమా నచ్చడం కష్టం. సినిమా ఎక్కువ యూత్, క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే రామ్, జానుల లవ్ స్టోరీ మంచి ఫీల్ రప్పించడంతో పాటు, ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :
– సమంత అద్భుతమైన నటన, స్పెషల్ గా కంటతడి పెట్టించే ప్రీ క్లైమాక్స్
– బ్యూటిఫుల్ చైల్డ్ హుడ్ లవ్ స్టోరీ
– హార్ట్ టచింగ్ ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్
– అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్

మైన‌స్ పాయింట్స్ (-) :
– స్లో నేరేషన్
– కొన్ని బోరింగ్ సీన్స్
– ఒరిజినల్ వెర్షన్ మ్యాజిక్ రీ క్రియేట్ అవ్వకపోవడం.

ఫైన‌ల్‌గా…
జాను ప్ర‌తిఒక్క‌రిని వాళ్ల కాలేజ్ డేస్‌, స్కూల్ డేస్‌లోకి ఖ‌చ్చితంగా తీసుకు వెళ్ల‌డంతో పాటు నాటి ప్రేమ‌ల‌ను గుర్తుకు తెచ్చే సినిమా. కాలేజ్‌, స్కూల్ డేస్‌ తొలిప్రేమని గుర్తు చేసి, అందులోని ఆనందాన్ని పెదవులపై నవ్వుగా, కలుసుకోలేక విడిపోయిన బాధని కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఎమోషనల్ లవ్ డ్రామా. అయితే స్లో నేరేషన్ కావడం వలన, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లాంటివి లేకపోవడం వలన కొంతమందికి బోర్ కొడుతోంది. కానీ ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చూసి, మన మెమొరీస్ గుర్తు పెట్టుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా.

జాను TJ ఫైన‌ల్ పంచ్‌: ప‌్ర‌తి ఒక్క‌రి స్కూల్ డేస్ ప్రేమ గుర్తుకు రావాల్సిందే

జాను TJ రేటింగ్‌: 3 / 5

శర్వానంద్ ,సమంత ‘జాను ‘ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts