జాను సినిమా థియేటర్లో ప్రాణాలు విడిచిన వ్యక్తి

February 8, 2020 at 12:23 pm

శర్వానంద్, సమంత జోడీగా వచ్చిన ‘జాను’సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ్ సినిమా 96’కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షుకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు.

శుక్రవారం ‘జాను’సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి గోకుల్ థియేటర్‌కు వచ్చాడు. ఇక సినిమా అయిపోయాక ప్రేక్షకులు అందరు వెళ్లిపోతున్నా…అతను మాత్రం సీట్లో నుంచి లేగలేదు. దీంతో అనుమానం వచ్చిన కొందరు నిద్రపోతున్నాడు అనుకుని లేపారు. అయినా లేగపోయేసరికి అతన్ని కదిలించి చూశారు. ఇక అప్పటికే చనిపోయాడని తెలుసుకుని దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు.

ఇక థియేటర్‌కు వచ్చిన పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు.

జాను సినిమా థియేటర్లో ప్రాణాలు విడిచిన వ్యక్తి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts