రాం చరణ్, తారక్ ల మధ్య యవ్వారం చెడిందా..!

February 13, 2020 at 12:57 pm

మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ల మధ్య వ్యవహారం చెడ్డదా.. అదేంటి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా.. బావా బావా అనుకునేంత చనువు ఉంది. మెగా నదమూరి మల్టీస్టారర్ గా ఇద్దరు కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా చేస్తున్నారు. అలాంటిది ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయని అనుకోవచ్చు. చరణ్, ఎన్.టి.ఆర్ మధ్య గొడవలైన విషయం నిజమే అట.. కాని అవి రియల్ గా కాదు రీల్ లైఫ్ లో అని తెలుస్తుంది

రాజమౌళి డైరక్షన్ లో తారక్, చరణ్ కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారట. అయితే ఈ సీన్స్ లో చరణ్, తారక్ తో గొడవ పడుతున్నాడట. సినిమాలో కొమరం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని తెలుస్తుంది.

ఇక సినిమాకు సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ కూడా అందిస్తాడని అంటున్నారు. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రాం చరణ్, తారక్ ల మధ్య యవ్వారం చెడిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts