ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: వెండితెరపై కనిపించనున్న తారక్

February 19, 2020 at 10:37 am

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల అవుతుంది. అయితే ఈ ఏడాదే సినిమా వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఇదొరకంగా బ్యాడ్ న్యూస్ అయింది.

ఎప్పుడో 2018 అక్టోబర్‌లో తారక్ సినిమా అరవింద సమేత సినిమా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ విడుదల అయ్యేవరకు తారక్ వెండితెరపై కనిపించాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే శివరాత్రి రూపంలో తారక్ అభిమానులకు శుభవార్త వచ్చింది. శివరాత్రి జాగరణ కొరకు అరవింద సమేత స్పెషల్ షో ప్రదర్శిస్తున్నట్లు హారిక హాసిని క్రియెషన్స్ వారు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.

అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని హైదరాబాద్, ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్న మయూరి థియేటర్‌లో రాత్రి 11:45 నిమిషాలకు స్పెషల్ షో వేస్తున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎన్టీఆర్‌ని వెండి తెరపై చూసి ఆనందించాలనుకునే వారు శివరాత్రి షోలకు వెళ్లడమే.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: వెండితెరపై కనిపించనున్న తారక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts