‘ఎన్టీఆర్ 30’ బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది !

February 19, 2020 at 5:28 pm

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని చేయనున్నారు. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అరవిందసమేత పెద్ద హిట్ కావడంతో తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో అతృత‌తో ఎదురుచూస్తున్నారు. తార‌క్‌తో త్రివిక్ర‌మ్ సినిమా ప్ర‌క‌టించ‌గానే ఎన్టీఆర్ అభిమానులు సంబ‌రాలు జ‌రుపుకుంటుండ‌గా, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ అయింది.

ఈ చిత్రాన్ని శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రిక హాసిని క్రియోష‌న్స్‌, నంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్మాణం జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి హీరో క‌ళ్యాణ్‌రామ్, ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈచిత్రాన్ని 2021లో స‌మ్మ‌ర్ విడుద‌ల చేస్తాన‌మ ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. అయితే సినిమా విడుద‌ల 2021 ఏప్రీల్ నెల‌లో విడుద‌ల అవుతుంద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతుంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర‌ షూటింగ్ ముగియగానే తారక్ ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇక చిత్రంలో కథానాయికలు, ఇతర తారాగణం ఎవరనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

‘ఎన్టీఆర్ 30’ బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts