వదిలేస్తే బెడ్ రూమ్ కు కూడా వచ్చేలా ఉన్నారు..!

February 18, 2020 at 12:11 pm

హీరోలతో పాటుగా సమాన ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కు కెరియర్ స్పాన్ తక్కువే అయినా సరే వెళ్లకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొందరు కేవలం కమర్షియల్ హీరోయిన్స్ గానే క్రేజ్ తెచ్చుకుంటే మరికొంతమంది మాత్రం వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. ఎలా చేసినా ఏం చేసినా హీరోయిన్స్ మీద ఆడియెన్స్ కు ఉన్న ఆ క్రేజ్ ఫాలోయింగ్ పెళ్లి ముందు వరకే.. పెళ్లి తర్వాత 90 శాతం హీరోయిన్స్ సినిమాలు ఆపేస్తారు. ఎవరో సమంత లాంటి వారు మాత్రం సినిమాలు చేస్తుంటారు.

అయితే స్టార్ క్రేజ్ ఉన్నా ఓ పక్క వయసు మీద పడుతుందనే భావన హీరోయిన్స్ లో కూడా ఉంటుంది. అందుకే హీరోయిన్ ను అడిగే కామన్ క్వశ్చన్స్ లో మీకు పెళ్లెప్పుడు అని అంటారు. అయితే ఇదే విషయాన్ని పదే పదే అడిగితే ఎలా చెప్పండి. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దశాబ్ధ కాలంగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి పదే పదే ప్రశ్నించే మీడియాపై ఫైర్ అవుతుంది.

తను ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చి పెళ్లి గురించి అడుగుతున్నారు. తను ఏమి చెప్పకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. ఆఖరికి మా బెడ్ రూం లోకి కూడా వచ్చి ప్రశ్నలని అడిగేలా ఉన్నారని ఫైర్ అవుతుంది కాజల్. చెల్లి నిషా అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోగా కాజల్ మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. మరి అమ్మడు పెళ్లి గురించి తీపికబురు ఎప్పుడు చెబుతుందో చూడాలి.

వదిలేస్తే బెడ్ రూమ్ కు కూడా వచ్చేలా ఉన్నారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts