ఎట్టకేలకు సీక్వెల్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నిఖిల్

February 28, 2020 at 4:09 pm

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో కార్తికేయ చిత్రం ఎంతటి సూపర్ హిట్ అయిందో తెలిసిందే. కలర్స్ స్వాతి హీరోయిన్‌గా, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం 2014లో రిలీజ్ అయి అద్భుత విజయం అందుకుంది. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గుడి నేప‌థ్యంలో మనషులు…ఎనిమ‌ల్ హిప్నాటిజ‌మ్ చేస్తే ఏం అవుతుందనే కొత్త పాయింట్‌తో వచ్చిన కార్తికేయ చిత్రం నిఖిల్ కెరీర్‌నే మలుపు తిప్పింది.

అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌ చేయాల‌ని దర్శకుడు చందూ మొండేటి ఎప్పటి నుంచో ప్లాన్స్ చేస్తూ వ‌స్తున్నారు. కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వెనక్కిపోతుంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు కార్తికేయ-2 చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సీక్వెల్ చిత్రం మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. `కార్తికేయ 2` పేరుతో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఈ సారి దేశ వ్యాప్తంగా వున్న మిస్టీరియ‌స్ టెంపుల్స్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2020 చివ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ సీక్వెల్‌ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు.

ఎట్టకేలకు సీక్వెల్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నిఖిల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts