కేసీఆర్ సారు.. ఎన్నిక‌ల హామీల‌ను మ‌రిచారూ..!

February 27, 2020 at 12:14 pm

న‌మ్మినాన‌బోస్తే పుచ్చి బుర్ర‌లు అయినంట‌. అనేది సామెత‌. ఇప్పుడు అలాగే త‌యారైంది తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి. అసెంబ్లీ ఎన్నిక‌లు గ‌డిచిపోయి ఇప్ప‌టికే ఏడాది దాటిపోయింది. మ‌ధ్య‌లో పార్ల‌మెంట్‌, స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌తో కాలం గ‌డిచిపోయింది. ప్ర‌జ‌లు వ‌రుస‌గా అధికార పార్టీకే జై కొడుతున్నారు. అది స‌రే కానీ సారు మాత్రం ఇప్ప‌టికీ అసెంబ్లీ ఎన్నిక‌ల నాటి హామీల‌పై దృష్టి సారించ‌లేదు. గ‌తంలో అమ‌లులోకి తీసుకొచ్చిన ప‌థ‌కాల‌నే కొన‌సాగిస్తున్నారే త‌ప్ప కొత్త‌వాటికి ఏ మాత్రం శ్రీ‌కారం చుట్ట‌లేదు ఇప్ప‌టివ‌ర‌కు. పిన్ష‌న్లు మిన‌హా క‌నీసం ఒక్క హామీని కూడా ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌లేదు. అస‌లు ఆ దిశ‌గా అడుగులు కూడా వేయ‌క‌పోవ‌డం శోచ‌నీయం. దీంతో ప్ర‌జ‌ల్లో ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల్లో నైరాశ్యం నెల‌కొన్న‌ది. అయిన‌ప్ప‌టికీ వారికి వేరేది ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో కారుతోనే ముందుకు సాగాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. ఇప్పుడిదే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జోరుగా సాగుతున్న‌ది. గులాభీ బాస్‌పై విమ‌ర్శ‌లకు తావిస్తున్న‌ది. మ‌రెందుకు ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది? కేసీఆర్ మ‌రెందుకు తాత్సారం చేస్తున్నారు? వ హామీల‌ను అమ‌లు చేస్తారా? చేయ‌రా? అనే ప్ర‌శ్న‌ల‌ను.. సందేహాల‌ను లేవ‌నెత్తుతున్న‌ది. వాటిని ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

మొట్ట‌మొద‌టి సారిగా అధికారంలోకి రాగానే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ఒక‌దాని వెన‌క ఒక‌దానిని అమ‌లు చేస్తూ వ‌చ్చారు. అప్ప‌టి మేనిఫెస్టోలో లేని క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్‌, కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. ఆ వెనువెంట‌నే అమ‌లులోకి తీసుకొచ్చారు. ఆ ప‌థ‌కాల ప‌నితీరు, ల‌బ్దిపొందున్న‌వారి దృష్ట్యా ఎంత‌యినా సారును అభినంద‌నీయులే. కొంత‌లో కొంత వ‌ర‌కు పేద‌ల‌కు ఎంతో ఊర‌ట‌నిస్తున్నాయి ఆయా ప‌థ‌కాలు. ఇక గ‌తేడాది ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా కేసీఆర్ అనేక ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. అందులో ముఖ్య‌మైనవి సొంత జాగా ఉన్న పేద‌ల‌కు రూ. 5ల‌క్ష‌ల రుణం మంజూరు చేస్తామ‌ని, నిరుద్యోగ భృతి ఒక‌టి. అదీగాక జిల్లాజిల్లాకూ తిరిగుతూ తానే స్వ‌యంగా కుర్చి వేసుకుని మ‌రీ పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీల‌ను గుప్పించి మ‌రీ ఓట్ల‌ను అభ్య‌ర్థించారు. ఎలాగూ గ‌తంలో చెప్పిన‌ట్లుగా, చెప్ప‌కుండానే ప‌థ‌కాలు అమ‌లు చేశారు క‌దా. ఈసారి కూడా చేస్తారు కాబోలున‌ని ప్ర‌జ‌లు గంపెడాశ‌తో కారు మీట‌ను ఎడాపెడా నొక్కారు. అంతే సారు జోరు పెరిగింది. క‌నీవినీ ఎర‌గ‌ని విజయం సొంత‌మైంది. అయితే ఏమిటీ ద‌క్కింది ఫ‌లితం అంటే మాత్రం శూన్యం.

కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు ప‌ద్నాలుగు నెల‌ల కాలం గ‌డిచిపోయింది. సారు చెప్పిన ఏ ఒక్క హామీ అమ‌లుకు నోచుకోలేదు. ఒక్క ఆస‌రా పింఛ‌న్ల‌ను మాత్రం ఇచ్చిన హామీ మేర‌కు పెంచి ఇస్తున్నారు. ఎన్నిక‌ల హామీల‌కు సంబంధించి అయితే ప్ర‌జ‌ల‌కు ఎదురుచూపులే మిగిలాయి త‌ప్ప ఆశ‌లు తీరే దారే క‌న‌బ‌డ‌డం లేదు. ఇదేమ‌ని అడిగితే వ‌రుస‌గా ఎన్నిక‌ల హ‌డావిడి కొన‌సాగుతున్న‌ది కాబ‌ట్టి ఎక్క‌డ చేసేది అంటూ ప్ర‌తిప‌క్షాల మీద‌కే ఎదురుదాడికి దిగుతున్న దుస్థితి. స‌రే గులాబీ అధినేత చెప్పిందే నిజం అనుకుందాం. వ‌రుస‌గా ఎన్నిక‌లు వ‌చ్చాయ‌నే అనుకుందాం. కొత్త ప‌థ‌కాల‌ను పెట్ట‌డం నిబంధ‌న‌ల కింద‌కు వ‌స్తుంది కాబ‌ట్టి చిక్కులుంటాయ‌ని భావిద్దాం. మ‌రి పాత ప‌థ‌కాల‌కు సంబంధించిన సంగతేమిటీ. కొత్త పింఛ‌న్ల మంజూరు లేదు. కొత్త రేష‌న్ కార్డులు ఇవ్వ‌డం లేదు. క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు సంబంధించి చెక్కుల‌ను స‌కాలంలో విడుద‌ల చేయ‌డం లేదు. ఆయా ప‌థ‌కాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని రోజులు, నెల‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సిన దుస్థితి. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ది.

మ‌రెందుకొచ్చింది ఈ మార్పు? అస‌లు ఆ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే ఉద్దేశం టీఆర్ ఎస్ స‌ర్కారుకు ఉందా? లేదా? ఎందుకింత తాత్సారం చేస్తుంది. అస‌లు ప్ర‌భుత్వ ఉద్దేశం, గులాబీ అధినేత ఉద్దేశం ఏమై ఉంటుంది? అని ప‌లువురు ఆశావ‌హులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అందులో చెప్ప‌డానికి, వేరే చించ‌డానికి ఏమీ లేదు. సూటిగా సుత్తి లేకుండా ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ప్ర‌భుత్వ ఖ‌జానా ఎప్పుడో ఖ‌ల్లాస్ అయిపోయింది. ఉద్యోగుల నెల‌వారీ జీతాల‌నే ప‌దో తారిఖీను ముట్ట‌జెప్పుతున్నారు. ఇక కొత్త ప‌థ‌కాల‌ను ఎక్క‌డి నుంచి అమ‌లు చేస్తారు. ఒక‌వైపు ఆర్థిక మాంధ్యం. త‌గ్గిన రెవెన్యూ ఆదాయం. కేంద్రం నిధులు. ఇలా స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు ఈ సారి సారు. అలాగ‌ని ఏమీ చేయ‌కుండా ఉంటే ప్ర‌జ‌ల్లో విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది క‌దా. మ‌రి వాటి నుంచి ఎలా త‌ప్పించుకోవాలి? ఏముంది రాత్రికి రాత్రికి ప‌ల్లెప్ర‌గ‌తి.. ఆ వెంట‌నే ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి పుట్టుకొచ్చాయి. వాటి ప‌రిస్థితి ఏమిటంటే పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్లుగా ఉంది. పైసా ఖ‌ర్చులేకుండా ఊరోళ్ల‌తో చెత్త ఎత్తిపోయించ‌డం. కాలువు తీయించ‌డం. స‌రి. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు. ఇటు పైస లేకుండా ఏదో చేస్తున్నామ‌నే పేరు. అటు ప్ర‌తిప‌క్షాల నోల్ల‌కు తాళాలు. మ‌రి ఎప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌రిస్థితి అంటే ఎన్నిక‌లు ఏ రెండేండ్ల ముందుగానే ఏమ‌న్న క‌ద‌లిక జ‌ర‌గొచ్చు. లేదంటే ఏ మ‌హాశ‌యుడ‌న్న ఇంత రుణ‌మిస్తే రేపే ఒక ప‌థ‌కం అమ‌లు కావ‌చ్చు. ఎటొచ్చినా ఇదేమ‌ని అడిగేవారు లేరు. సారు, కారుకు తిరుగులేదు. అంతా కేసీఆర్ ద‌యా. తెలంగాణ ప్రాప్తం. ఇప్ప‌టికీ ఉన్న ప‌థ‌కాల‌తోనే కాలక్షేపం.

కేసీఆర్ సారు.. ఎన్నిక‌ల హామీల‌ను మ‌రిచారూ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts