వంట గ్యాస్ ధర భగ్గుమంది.

February 12, 2020 at 3:23 pm

నాన్ సబ్సిడీ వంటగ్యాస్‌పై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక్కసారిగా రూ.144.5 పెంచేసింది.పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ.858.50లకు చేరింది. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ పెరగడం ఇదే తొలిసారి.అంతర్జాతీయంగా ధరలు పెరిగినందునే ధరలు పెంచినట్టు ఐఓసీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా లాంటి మెట్రో నగరాలకు ఈ ధరలు పరిమితమవుతాయని చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధరలు ఇంతే ఉండనున్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర ఇంచుమించు రూ.147 పెరగనుందని సమాచారం.

వంట గ్యాస్ ధర భగ్గుమంది.
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts