మహేశ్ సినిమా టైమ్ పట్టేలా ఉందే…?

February 22, 2020 at 3:56 pm

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు…తన తదుపరి చిత్రం మళ్ళీ వంశీ పైడిపల్లితో తీయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మహర్షి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీతో, మరోసారి పవర్ ఫుల్ స్టోరీ రావడానికి సిద్ధమయ్యాడు.

సరిలేరు సినిమా విజయం తర్వాత హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లొచ్చిన మహేశ్ బాబు, వంశీ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇందులో మహేశ్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. అయితే అంతా బాగానే నడుస్తుందనుకునే తరుణంలో మహేశ్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌తో ఫుల్ గా సంతృప్తి చెందని మహేష్, స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చెప్పారట. దీంతో మహేశ్ చెప్పినట్లుగా స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మే నెలలో మొదలవ్వాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మహేశ్ సినిమా టైమ్ పట్టేలా ఉందే…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts