స్టార్ డైరెక్టర్ టైటిల్ కొట్టేసిన మంచు హీరో !

February 13, 2020 at 4:16 pm

గత మూడేళ్ళ నుంచి మంచు మనోజ్ వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత సమస్యలు వల్ల సినిమాలు చేయకుండా ఆగిపోయారు. అయితే దాదాపు మూడేళ్ళ తర్వాత మనోజ్ సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసుకుని, ఆ బ్యానర్ పై తొలి సినిమాగా ‘అహం బ్రహ్మాస్మి’ని ప్రకటించాడు. అయితే మంచు వారు అబ్బాయి కాస్త ఆలస్యమైనా మంచి పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేసుకున్నాడని అనుకుంటున్నారు.

అయితే ఈ పవర్‌ఫుల్ టైటిల్ నిజానికి దర్శకుడు క్రిష్‌ది అంటా. చాలా కాలం క్రితమే క్రిష్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడట. ఒకానొక సమయంలో రానా – అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ టైటిల్‌పై సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే అలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు కానీ, టైటిల్ మాత్రం క్రిష్ వద్దే ఉందట.

ఈ నేపథ్యంలోనే మనోజ్ తన దగ్గరికి వచ్చిన కథకి ఈ టైటిల్ బాగుటుందని భావించి, క్రిష్‌ను రిక్వెస్ట్ చేశాడట. ఇక వీరికి వేదం సినిమా దగ్గర నుంచి మంచి సాన్నిహిత్యం ఉండటంతో, మనోజ్ అడగ్గానే క్రిష్ టైటిల్ ఇచ్చేశాడట. ఈ విధంగా మంచు వారి అబ్బాయికి పవర్ ఫుల్ టైటిల్ దొరికింది.

స్టార్ డైరెక్టర్ టైటిల్ కొట్టేసిన మంచు హీరో !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts