భారీ బడ్జెట్‌తో పౌరాణిక చిత్రం చేయనున్న టాలీవుడ్ హీరో

February 22, 2020 at 9:10 am

మంచు ఫ్యామిలీ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ లాంటి పాన్ ఇండియా సినిమాతో వెండితెర మీద కనిపించనుండగా, అటు మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. దీనికి సంబందించిన లుక్‌ కూడా తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పట్టాల మీద ఉండగానే, మంచు విష్ణు మరో బడ్జెట్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. పౌరాణిక చిత్రం ‘భక్త కన్నప్ప’లో నటించనున్నాడని మోహన్ బాబు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రం దాదాపు 60కోట్లుతో తెరకెక్కుతుందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో పౌరాణిక చిత్రం చేయనున్న టాలీవుడ్ హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts