మండలి రద్దుకి ఓకే చెప్పిన మోడీ…!

February 12, 2020 at 6:27 pm

ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటుగా విభజన హామీలను ఇరువురు చర్చి౦చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళిన జగన్, నేరుగా విమానాశ్రయానికి వెళ్లి ప్రధానితో చర్చలు జరిపారు.

ఇరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్‌ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని జగన్ కోరారు.

రాష్ట్రం ఆర్ధికంగా కష్టాల్లో ఉందని ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా వెళ్లిన ఆయన వాటినే చర్చించినట్టు తెలుస్తుంది. ఇక మండలి రద్దు అంశాన్నే ప్రధానంగా జగన్ చర్చించారని సమాచారం. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని చర్చించాలని, బిల్లుని ఆమోదించాలని ఆయన కోరారు.

దీనికి మోడీ అంగీకరించారని అంటున్నారు. ఇక రేపు హోం మంత్రి అమిత్ షాని కలిసిన తర్వాత జగన్ ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్‌ , మార్గాని భరత్‌, నందిగం సురేష్‌, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్‌, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు.

మండలి రద్దుకి ఓకే చెప్పిన మోడీ…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts