ఆలయంలో ఇటాలియన్ జంట శృంగారం.. ఆపై వీడియో తీసి పోర్న వెబ్ సైట్లో అప్లోడ్

February 14, 2020 at 6:40 pm

పుర్రెకో బుద్దీ.. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలాంటి జంటను చూసే అనుంటారు. ఎవరైనా ఓ పవిత్ర స్థలానికి వెళ్తే సంప్రదాయ బద్దంగా ఉంటారు. పర్యాటక ప్రాంతమైతే మంచి స్టిల్స్ పెట్టి ఫొటోలు దిగుతారు. కానీ ఈ జంట మాత్రం కామకాలాపాలకు దిగింది. పట్ట పగలు బరితెగించి శృంగారం చేసిఐది. అక్కడితో ఆగకుండా ఆ మొత్తాన్ని వీడియో తీసుకుంది.
ఆపై దానిని పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసింది. అందులోని ఆలయాన్ని పలువురు గుర్తించడంతో అసలు విషయం బయటకి వచ్చింది. ఈ సంఘటన మయన్మార్ లో జరిగింది.

మయన్మార్‌లోని ప్రాచీన నగరం బగాన్‌. బౌద్దుల పవిత్ర స్థలం. అదీగాక యునెస్కో వారసత్వ నగరం.  నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చి ఆ బౌద్దాలయాన్ని సందర్శిస్తుంటారు. అదే విధంగా ఇటలీకి చెందిన ఓ 23 ఏళ్ల యువ జంట ఆ ప్రాంతాన్ని సందర్శించింది. ఏమనిపించిందో, లేక కొత్తదనం కోసమో వారు అక్కడే శృంగారానికి తెగబడ్డారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ తతంగాన్నంతా షూట్ చేసుకుంది. ఆపై దానిని ఓ పోర్న్ వెబ్ సైట్లో అప్లోడ్  చేసి తమ పైత్యాన్ని ప్రదర్శించింది. ఆ వీడియో తెగ వైరల్  గా మారింది. ఇదిలా ఉండగా దానిని వీక్షించిన కొందరు ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో బగాన్ ఆలయాన్ని గమనించి నివ్వెరపోయారు. ఘన చరిత్ర కలిగిన ప్రాంతం వద్ద శృంగారం జరపడంపై మండిపడుతున్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మయన్మార్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆలయంలో ఇటాలియన్ జంట శృంగారం.. ఆపై వీడియో తీసి పోర్న వెబ్ సైట్లో అప్లోడ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts