నాని – సుధీర్‌బాబు వి స్టోరీ లైన్ లీక్‌…!

February 22, 2020 at 10:28 am

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వి’. తాజాగా విడుదలైన ఈ ఈ సినిమా టీజ‌ర్ ప్రేక్ష‌కులను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కే క‌థాంశంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ వికు క‌థ‌కు లింకేంటి అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ చ‌ర్చ‌ల ప్ర‌కారం మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి గ‌తంలో నానితో తీసిన జెంటిల్మెన్ త‌ర‌హాలోనే ఈ సినిమా క‌థ ఆద్యంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆక‌ట్టుకుంటుంద‌ట‌. సినిమా కథ, కథనం అంతా ‘వి’ అనే అక్షరం చుట్టే తిరుగుతుందట. తాను క్రైమ్ చేసిన ప్రతిచోట ‘వి’ అనే అక్షరాన్ని క్లూ గా వదిలి వెళ్తుంటాడట కిల్లర్.

ఈ క్రైంను క‌నిపెట్టేందుకు ఎంతో మంది సిన్సియ‌ర్ పోలీస్ అధికారులు వ‌చ్చినా వాళ్లంద‌రూ చేతులు ఎత్తేస్తుంటార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ వి అనే క్లూ ఆధారంతో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంటాడట. అయితే అసలు కిల్లర్ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? ఆ కిల్ల‌ర్‌కు వి అనే అక్ష‌రానికి ఉన్న లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా క‌థ అని టాక్‌..?

వి సినిమాలో నాని డార్క్ షేడెడ్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మోహ‌న్ కృష్ణ ఇంద్ర‌గంటి – నాని కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన అష్టా చెమ్మా, జెంటిల్మెన్ సినిమాలు రెండు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇటీవ‌ల నాని త‌న రేంజ్‌కు త‌గిన హిట్ అయితే ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో నానితో పాటు సుధీర్ బాబు సైతం ఈ వి సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వీరి ఆశ‌లు ఈ సినిమా ఎంత వ‌ర‌కు నిజం చేస్తుందో ? చూడాలి.

నాని – సుధీర్‌బాబు వి స్టోరీ లైన్ లీక్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts