సిగరెట్‌తో పోటీ పడుతున్న నాని…!

February 18, 2020 at 3:20 pm

తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న నాని….ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తుండగా, నాని సీరియల్ కిల్లర్‌గా నటిస్తున్నాడు. నివేథా థామస్, అతిథి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘వి’ చిత్రం నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే యూ ట్యూబ్‌లో వి టీజర్ 3 మిలియన్ వ్యూస్ పైనే రాబట్టింది.

ఇక టీజర్‌ ప్రమోషన్‌లో భాగంగా నాని ఈరోజు ఓ ట్వీట్ చేశాడు. స్మోక్ చేస్తూ కిల్లర్ గెటప్‌లో సీరియస్‌గా ఉన్న తన ఫోటో పోస్ట్ చేసి దానికి ఓ కొటేషన్ పెట్టాడు. ’స్మోకింగ్ కిల్స్, కానీ కింద స్మోక్ చేస్తూ ఉన్న వాడు ఇంకా వేగంగా చంపేస్తాడు‘ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ బట్టి చూస్తే, వి మూవీలో నాని పాత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో అర్ధమవుతుంది. కాగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు.

సిగరెట్‌తో పోటీ పడుతున్న నాని…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts