పవన్ సినిమాకు ఎండ్ కార్డ్..?

February 20, 2020 at 11:15 am

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినిమాలు చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు ఒప్పుకుని షూటింగ్‌ల్లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్‌లో నటిస్తున్న పవన్…క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.

అయితే పవన్ రీఎంట్రీలో మొదట వెండితెర మీద కనిపించే చిత్రం పింక్ రీమేక్‌లోనే. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కోర్ట్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ షూటింగ్ 30 న తేదీ వరకు సాగనుంది. ఆ తర్వాత మిగిలిన పార్ట్‌ను మార్చి 20నుంచి షూట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ముగియనుందని, ఏప్రిల్ 10 తేదీలోపే సినిమా షూటింగ్‌కు ఎండ్ కార్డ్ పడనుందని తెలుస్తోంది. అలాగే చిత్రాన్ని మే 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ సినిమాకు ఎండ్ కార్డ్..?
0 votes, 0.00 avg. rating (0% score)