రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌.. ప‌వ‌న్ ప్ర‌సంగంపై ఉత్కంఠ !

February 15, 2020 at 11:33 am

చాలా రోజుల త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, గ‌త ప‌ర్య‌ట‌న‌ల‌కు ఈ ప‌ర్య‌ట‌న‌కు చాలా వ్య‌త్యాసం.. చాలా ఇంపార్టెన్స్ ఉండ‌డంతో ఈ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధా న్యం పెరిగిపోయింది. గ‌తంలో ప‌వ‌న్ ఏం చెప్పినా.. పెద్ద‌గా ప‌ట్టించుకున్న వారు ఉన్నారు. మ‌రికొంద‌రు ప‌ట్టించుకోని వారు కూడా ఉన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించ‌లేక పోవ‌డం తోపాటు.. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న చంద్ర‌బాబుతో వైరం పెట్టుకోవ‌డం వంటి ప‌రిణామాల కార‌ణంగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం సిల్లీగానే మారిపోయింది.

దీంతో ప‌వ‌న్ సినిమా డైలాగులను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఏదో నాలుగు డైలాగులు, నాలుగు యా క్షన్లు త‌ప్ప ఇంకేమీ ఉండద‌ని అంద‌రూ నిర్ధార‌ణ‌కు వ‌చ్చేశారు. దీంతో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్ద‌గా ప్ర‌చారం ఉన్నా.. పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయ‌న రాజ‌కీ యంగా వేసిన అడుగు కీల‌కంగా మార‌డంతో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆస‌క్తిగా మారింది. ఇ ప్పుడు రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌బుత్వం రాజ‌ధానిపై ఒక నిర్ణ‌యంతో ముందుకు సాగుతోంది. ఇక‌, అన్ని ప‌క్షా లు.. కూడా తీవ్ర వ్య‌తిరేక‌త చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆందోళ‌న‌లు చేస్తున్నాయి.

అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఈ స‌మ‌స్య‌పై ఇప్ప‌టికే ఒక నిర్దార‌ణ‌కు వ‌చ్చాం కాబ‌ట్టి ఎంత లేటైనా.. త‌మ నిర్ణ‌యం త‌మ‌దేన‌ని చెబుతోంది. ఇక‌, ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకా శం లేనందున‌.. త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్రమే దిక్కంటూ ఇక్క‌డి రైతులు, మ‌హిళ‌లు కొ న్నాళ్లుగా చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని.. ప‌వ‌న్ కూడా గ‌తంలో చెప్పుకొచ్చారు. కేంద్రంలో ప్ర‌ధాని న రేంద్ర మోడీ వ‌చ్చి శంకుస్థాప‌న చేసిన రాజ‌ధాని ప్రాంతాన్ని ఎలా మారుస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అ దేస‌మ‌యంలో ఇటీవ‌ల ఆయ‌న బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

అంతేకాదు, రాబోయే రోజుల్లో బీజేపీ-జ‌న‌సేన క‌లిసే పోటీ చేస్తాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు కేం ద్రాన్ని ఒప్పించే శ‌క్తి, లేదా కేంద్రంతో రాజ‌ధాని స‌మ‌స్య‌ను చ‌ర్చించే శ‌క్తి ప‌వ‌న్‌కు ఉంద‌ని, ఉంటుంద‌ని రాజ‌ధాని ప్ర‌జ‌లు గ‌ట్టిగా విశ్వ‌సిస్తున్నారు. దీంతో తాజా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతార‌నే విష యం ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు ప‌వ‌న్ ఏం చెప్పినా.. కేంద్రం చెప్పింద‌నైనా భావించాలి. లేదా కేంద్రం ద‌గ్గ‌రకు ఈ స‌మ‌స్య‌ను తీసుకువెళ్తాడ‌నే భ‌రోసా అయినా ఇక్క‌డి రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల్సి ఉంటుంది. దీంతో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న చాలా ఆస‌క్తిగా మారింది. మ‌రి ప‌వ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.

రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌.. ప‌వ‌న్ ప్ర‌సంగంపై ఉత్కంఠ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts