మరోసారి సింగర్ అవతారమెత్తనున్న పవన్?

February 18, 2020 at 10:29 am

పూర్తిగా జీవితం ప్రజలకే అంకితమని చెప్పి, రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్…మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అభిమానులకు పండగలాంటి వార్తని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ పండగని మరింత రెట్టింపు చేస్తూ…పవన్ వరుసగా సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్‌ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ ఓ పాట కూడా పాడనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ జానీలో ‘నరాజు గాకురా అన్నయా, అత్తారింటికిదారేది సిన్మాలో ‘కాటమరాయుడు’ పాటలతో సింగర్ అవతారమెత్తాడు. ఇక ఇప్పుడు జానపద పాటలు బాగా ఇష్టపడే పవన్, క్రిష్ సినిమాలో కూడా ఓ పాటని పాడనున్నాడని తెలుస్తోంది.

కాగా, గబ్బర్‌సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హరీష్ శంకర్‌తో కూడా పవన్ ఓ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే.

మరోసారి సింగర్ అవతారమెత్తనున్న పవన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts