రేణు దేశాయ్ కు పవన్ అదిరిపోయే గిఫ్ట్ !

February 13, 2020 at 11:08 am

2019 ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఊహించని విధంగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్ధిక పరిస్థితులు, కుటుంబాన్ని పోషించుకోడానికి అని చెప్పి పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే పింక్ రీమేక్‌లో నటిస్తున్న పవన్, క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక పవన్ ఒక్కో చిత్రానికి దాదాపు రూ.40 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందులో కొంత డబ్బుని పవన్…తన మాజీ భార్య రేణు దేశాయ్ కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. రేణుతో పాటు తన ఇద్దరు పిల్లలు కోసం హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ని కొన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వచ్చింది. ఇక ఆ ఫ్లాట్‌లోకి రేణు..తన ఇద్దరి పిల్లలని తీసుకుని రీసెంట్‌గా వచ్చినట్లు తెలిసింది.

పవన్ కళ్యాణ్ తన పిల్లలకు సౌకర్యంగా ఉండటానికి విలాసవంతమైన ఆ ఫ్లాట్ కోసం దాదాపు 5 ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక తన ఫ్యామిలీ ఫ్లాట్‌కి వచ్చాక, పవన్ కళ్యాణ్ కూడా వారిని తరచూ కలుస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రేణు త్వరలోనే ఓ చిత్రానికి దర్శకత్వం చేయాలని చూస్తుందని, ప్రస్తుతం ఆమె అదే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే కుమారుడు అకిరాని కూడా త్వరలో వెండితెరపై పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

రేణు దేశాయ్ కు పవన్ అదిరిపోయే గిఫ్ట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts