ఎంట్రీలోనే యాక్షన్‌లోకి దిగుతున్న పవన్

February 14, 2020 at 10:35 am

చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్…మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. వెంటవెంటనే మూడు భారీ ప్రాజెక్టులు ఒప్పుకుని షూటింగ్ బిజిలో పడిపోయారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్‌లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ అప్‌డేట్ ఒకటి తెలిసింది. అసలు పవన్ కల్యాణ్ ఎంట్రీనే హై వోల్టేజ్ యాక్షన్‌తో మొదలు కానుంది. ఓ భారీ ఫైట్ సీన్‌తో పవన్ ఎంట్రీ ఉంటుందట.

ఇక ఈ ఫైట్ పవన్ అభిమానులని ఉర్రూతలాగిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే చిత్రబృందం ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైటిల్, పవన్ ఫస్ట్ లుక్ ఉగాది రోజున వచ్చే అవకాశముంది. కాగా, ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ పింక్ చిత్రంతో పాటు, క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా, హరీష శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

ఎంట్రీలోనే యాక్షన్‌లోకి దిగుతున్న పవన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts