ప్రభాస్‌కు మంచు ఫ్యామిలీ భారీ షాక్!

February 22, 2020 at 1:08 pm

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఊహించని విధంగా భక్త కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దాదాపు 60 కోట్ల బడ్జెట్ పెట్టనున్నట్లు కూడా చెప్పారు. అలాగే చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణలని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అయితే భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రకటించి మంచు ఫ్యామిలీ ప్రభాస్‌కు భారీ షాక్ ఇచ్చింది.

అసలు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు 1976లో భక్త కన్నప్ప చిత్రంలో నటించారు. అప్పట్లో ఆ చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే తాను నటించిన భక్త కన్నప్ప చిత్రాన్ని మళ్ళీ ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. అటు ప్రభాస్ కూడా ఒకవేళ కృష్ణంరాజు సినిమాని గనక రీమేక్ చేయాలనుకుంటే భక్త కన్నప్ప సినిమాని రీమేక్ చేస్తానని, అందులో తనే హీరోగా నటిస్తానని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

ఇక వీరు మాటలకే పరిమితమైన భక్త కన్నప్ప చిత్రాన్ని ఇప్పుడు మంచు ఫ్యామిలీ మళ్ళీ వెండితెర మీదకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రభాస్‌కు మంచు ఫ్యామిలీ భారీ షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts