ప్రభాస్ సినిమాలో విలన్ ఫిక్స్?

February 13, 2020 at 12:13 pm

సాహో లాంటి హైవోల్టేజ్ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ 1960ల నాటి ఓ పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. జగపతిబాబు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇంతవరకూ చేయని పాత్రలో ఆయన కనిపిస్తారని అంటున్నారు.

ఇక యూవీ క్రియేషన్స్ వారు, కృష్ణంరాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు మొదట ‘జాను’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ టైటిల్‌ని సమంత-శర్వానంద్ నటించిన 96 రీమేక్ చిత్రానికి పెట్టి, రిలీజ్ కూడా చేశారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ పెట్టడానికి చూస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేసే అవకాశాలున్నాయి.

ప్రభాస్ సినిమాలో విలన్ ఫిక్స్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts