రామ్‌చ‌ర‌ణ్ భర్త్‌డే స్పెషల్ ఇవేన‌ట‌..!

February 19, 2020 at 4:30 pm

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు కు ఇంకా 39రోజుల స‌మ‌యం ఉంది. అయితే ఇప్ప‌టి నుంచే అందుకు త‌గిన విధంగా ఆయ‌న అభిమానులు భారీ అంచ‌నాల‌తో ఉన్నారు.అంతే కాదు.. రామ్ చ‌ర‌ణ్ పుట్టినరోజు వేడుక‌లు ఘ‌నంగా చేసేందుకు అభిమానులు స‌న్న‌హాలు చేస్తున్నారు. అయితే ఓవైపు అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తుంటే మ‌రోవైపు ఆయ‌న చిత్రాల‌ను సంబంధించిన అప్‌డేట్స్ రాబోతున్నాయి. రామ్ చ‌ర‌ణ్ సినిమాల అప్‌డేట్స్ రానున్నాయ‌నే ఆనందంలో అభిమానులు ఉన్నారు.

మార్చి 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఆ రోజుతో రామ్ చ‌ర‌ణ్ 35 ఏళ్ళ వ‌య‌స్సులోకి అడుగు పెడుతున్నాడు. ఈ త‌రుణంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమాలకు సంబంధించిన ఆప్‌డేట్స్ రానున్నాయనే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతుంది. అభిమానులు కూడా ఈ చిత్రాల ఆప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం అఫ్‌డేట్ రానున్న‌ద‌నే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన ఆప్‌డేట్స్‌ను రాజ‌మౌళీ ఈరోజు ఇవ్వ‌నున్నాడ‌నే టాక్ ఉన్న నేప‌ధ్యంలో అభిమానులు ఎంతో అతృత‌తో ఎదురు చూస్తున్నారు.

ఇక రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించ‌బోయే కొర‌టాల శివ చిత్రంలో న‌టించే విష‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇక రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడీ, హ‌రీష్‌శంక‌ర్‌తో సినిమాలు చేస్తాడ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఏ ద‌ర్శ‌కుడి సినిమాలో న‌టిస్తాడో ఈరోజు తేలిపోతుంది. అంటే రామ్ చ‌ర‌ణ్ న‌టించే సినిమాలు.. న‌టిస్తున్న సినిమా అప్‌డేట్స్ మార్చి 27న రానున్నాయి. దీంతో అభిమానులు ఇప్ప‌టి నుంచే తెగ హడావుడి చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి క‌చ్చితంగా రాజ‌మౌళీ అప్‌డేట్ ఇస్తాడ‌ని.. బాహుబ‌లి సినిమా టైమ్‌లో ప్ర‌భాస్ పుట్టినరోజుకు ఇలాగే అప్‌డేట్ ఇవ్వ‌డంతో.. రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు కూడా త‌ప్ప‌క అప్‌డేట్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ భర్త్‌డే స్పెషల్ ఇవేన‌ట‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts