ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా దూసుకెళుతున్న మాస్ రాజా…

February 14, 2020 at 4:07 pm

ఈ మధ్య కాలంలో మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్ పెద్దగా బాగోలేదన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రం తప్ప…మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక తాజాగా కూడా డిస్కో రాజాతో అదృష్టం పరిస్ఖించుకోగా, అది కూడా దారుణ పరాజయం పాలైంది. అయితే ఫ్లాప్ అయిందని చెప్పి గ్యాప్ ఇవ్వకుండా, వరుస పెట్టి సినిమాలు తీయాలని రవి తేజ ఫిక్స్ అయ్యారు.

ప్రస్తుతం రవితేజ…తనకు బలుపు, డాన్ శీను లాంటి సూపర్ హిట్స్ అందించిన గోపించంద్ మలినేనితో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మే 8వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత రవితేజ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వెంటనే రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమాను కూడా విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే డిస్కో రాజా ఈ ఏడాది మొదట్లో వచ్చింది. ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా దూసుకెళుతున్న మాస్ రాజా…
0 votes, 0.00 avg. rating (0% score)