రామ్ ” RED ” ఆఫీషియల్ టీజర్

February 28, 2020 at 5:21 pm

రామ్ పోతినేని ఈ మ‌ధ్య వ‌చ్చే చిత్రాలు పెద్ద‌గా హిట్ కొట్ట‌డంలేదు. గ‌త కొంత కాలంగా ఫ్లాప్‌ల‌లో న‌డుస్తుంది. అయితే ఇటీవ‌లె పూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రంతో స‌డెన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు రామ్‌. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `రెడ్` మూవీతో ఆయ‌న ఒక ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. అయితే ఇస్మార్ట్ హిట్‌తో రెచ్చిపోతున్న రామ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ చిత్రం ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుంది. ఇంకా ఈచిత్రంలో నివేద- మాళవిక- నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మిగ‌తా సినిమాల‌కి కాస్త భిన్నంగా ఉంటుంది. ట్రైల‌ర్‌లో రాపో సంథింగ్ స్పెష‌ల్ అంటూ మొద‌లయ్యే రామ్‌. ఈ చిత్రంలో చాలా డిఫ‌రెంట్‌గా క‌న‌ప‌డుతున్నాడు. ఇందులో అత‌డు చేసే క్రైమ్ వేరొక‌రు చేయ‌లేరు. క్రైమ్ హిస్ట‌రీలోనే ఇలాంటి కేసు వేరొక‌టి ఉండ‌దు అంటూ రామ్ ఫ్యాన్స్‌లోకి టీజ‌ర్‌తో దూసుకెళుతున్నారు. ఈ రోజు విడుద‌లైన ఈ టీజ‌ర్ చూసిన ప్రేక్ష‌కులు కొంచం క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారు. రామ్ సింగ్‌రోలా, లేక డ‌బుల్ రోలా కాస్త అర్ధంకాకుండా ప్రేక్ష‌కుల్లో కొంత ఎగ్జైట్‌మెంట్ ఉండేలా టీజ‌ర్ క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఈ చిత్రంలో రామ్ 6ప్యాన్‌ని స్పెష‌ల్‌గా చూపిస్తాడ‌ని తెలిసింది.

ర‌ఫ్‌గా కొంత విల‌న్ గెట‌ప్‌లో గుబురు గ‌డ్డంతో ఎప్పుడూ ఉన్న‌ట్లు గ్లామ‌ర్‌గా రామ్ ఇందులో క‌నిపించ‌లేదు. అలాగే మ‌రో పాత్ర‌లో కాస్త సాఫ్ట్‌గా క‌నిపించాడు కాని అందులో కూడా పెద్ద గ్లామ‌ర్‌గా అయితే అనిపించ‌లేదు. కిశోర్ ఈ చిత్రాన్ని ఏ విధంగా తెర‌కెక్కించారు ఏంటి అన్న‌ది తెలియాల్సి ఉంది. రామ్ ఇంతకీ ఇందులో ఒక్కడేనా ఇద్దరా? అన్నదే అసలు సిసలు సస్పెన్స్. నిజ జీవిత సంఘ‌ట‌న‌ల‌ను తీసుకుని కథగా రాసుకుని దానిని తెర పై ఎగ్జిక్యూట్ చేసిన విధానం మెప్పిస్తుందని చెబుతున్నారు. పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఎవరికీ చిక్కకుండా క్రిమినల్ తప్పించుకోవడం వగైరా రక్తి ఇవ‌న్నీ ఒక స‌స‌పెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రామ్ ” RED ” ఆఫీషియల్ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)