ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు… ఎవ‌రో తెలుసా…!

February 23, 2020 at 12:53 pm

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత ఆయన చాలా లాంగ్ గ్యాప్‌ తీసుకొని తెర‌కెక్కిస్తోన్న సినిమా ఆర్ ఆర్‌ ఆర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరూ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు అందరూ ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే ఎస్ ఎస్ రాజమౌళి అని ఠక్కున చెప్పేస్తారు. అయితే గూగుల్ మాత్రం రాజమౌళి తో పాటు మరో వ్యక్తి పేరు కూడా చూపిస్తోంది.

అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే దర్శకత్వం స్థానంలో రాజమౌళి పేరు తో పాటు సంజయ్ పాటిల్‌ అనే వ్యక్తి కూడా ఈ సినిమా డైరెక్టర్ గా చూపిస్తోంది. అస‌లు సంజ‌య్ పాటిల్ ఎవ‌రు ? అన్న‌ది సెర్చ్ చేస్తే మాత్రం ఏం చూపించ‌డం లేదు. ఇది చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది.

దీనిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ సంజ‌య్ పాటిల్ ఎవ‌రో గూగుల్‌కే తెలియాల‌ని అంటున్నారు. ఇక అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా.. ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిన్ నటిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు… ఎవ‌రో తెలుసా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts