ఆ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న సమంత …!

February 19, 2020 at 3:33 pm

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు దొరికిన ఆణిముత్యం ఆ అమ్మ‌డు. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును గిలిగింత‌లు పెట్టిన ఈ అందాల సుంద‌రి సిని హీరోను పెళ్ళీ చేసుకుంది. హీరోను పెళ్ళీ చేసుకున్న త‌రువాత ఈ హీరోయిన్ క్ర‌మంగా హీరోయిన్ పాత్ర‌ల నుంచి జారుకుంటూ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు దృష్టి సారించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ త‌న స‌త్తా చాటుతున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా సినిమాల‌కు గుడ్ బై చెప్పింద‌నే టాక్ నిపిపిస్తుంది. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఇటీవ‌ల ఈ భామ కొత్త సినిమాల‌ను ఒప్పుకోవ‌డం లేదు. సైన్ చేసిన సినిమాల‌నే చేస్తూ ముందుకు సాగుతూనే ఇప్పుడు కొత్త‌గా ఓ బిజినెస్ ప్రారంభించ‌బోతున్నారు.

గ‌తంలో చిత్ర సీమ‌లో ఎంద‌రో హీరోయిన్లు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న చందంగా సినిమాల్లో రాణిస్తూనే బిజినెస్‌ల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా త‌న కుటుంబ గౌర‌వం కోసమా లేక‌.. త‌న భ‌ర్త కోరిక మేర‌కో ఏమో గాని.. సినిమాల‌ను ఒప్పుకోవ‌డం మానేసి ఇప్పుడు బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. ఇంత‌కు ఎవ‌రా హీరోయిన్ అనుకుంటున్నారు క‌దా.. ఆమె ఎవ‌రో కాదు.. ఏమాయ చేసావో హీరోయిన్ స‌మంత.. అక్కినేని నాగ‌చైత‌న్య‌ను పెళ్ళి చేసుకున్న త‌రువాత హీరోయిన్‌గా ప‌లు చిత్రాల్లో న‌టించిన స‌మంత‌.. క్ర‌మంగా లేడీ ఓరియెంటెండ్ చిత్రాల వైపు దృష్టి సారించారు.

ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌ను కూడా వ‌దులుకుంటూ.. స్కూల్ ఓపెన్ చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈనెల 22న ఆ పాఠ‌శాల‌ను ప్రారంభించ‌బోతున్నారు. స‌మంత‌ గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ఫ్రీస్కూల్ ను ఓపెన్ చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ని, స‌మంత తో పాటుగా శిల్పారెడ్డి, ముక్తా ఖురానాలు ఈ ఫ్రీస్కూల్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఈ పాఠ‌శాల జూబ్లీహిల్స్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకో విష‌యం ఎంటంటే.. శిల్పారెడ్డి స‌మంత మామ‌, హీరో నాగార్జున‌తో క‌లిసి ప‌లు బిజినెస్‌ల్లో పార్ట‌న‌ర్‌గా ఉన్నారు. సో స‌మంత పాఠ‌శాల ప్రారంభించాక ఇక సినిమాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తారు కాబోల‌ని అభిమానులు అనుకుంటున్నారు. వాస్త‌వానికి స‌మంత తెలుగులో ఇప్పుడు ఒక్క జాను త‌ప్పితే మ‌రో సినిమా ఒప్పుకోలేదు. అంటే తెలుగులో స‌మంతకు సినిమాలు చేతిలో ఏమీ లేవ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక త‌మిళంలో సినిమాలు ఉన్న‌ప్ప‌టికి ఆ సినిమాల్లోనూ స‌మంత రెండో హీరోయిన్‌గానే చేస్తొంది. ఇక స‌మంత మెల్ల‌మెల్ల‌గా సినిమాల‌కు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి బిజినెస్ ప‌ర్స‌న్‌గా కొసాగుతార‌నే ప్ర‌చారం టాలీవుడ్‌లో అనిపిస్తుంది.

ఆ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న సమంత …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts