అభిమాని చేసిన పనికి ఉరికించిన స్టార్ హీరో కూతురు..

February 14, 2020 at 4:29 pm

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ట్రోల్స్ నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏ సిని పరిశ్రమ అయినా సరే ప్రేక్షకులకు నచ్చితే ఎంతగా పొగిడేస్తారో.. నచ్చకపోతే అంతగా ట్రోల్స్ చేస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలి ఖాన్ డాటర్ సారా ఖాన్ ను ఓ అభిమాని వదినా అని పిలిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కార్తిక్ ఆర్యన్ హీరోగా సారా ఖాన్ హీరోయిన్ గా నటించిన సినిమా లవ్ ఆజ్ కల్. ఇంతియాజ్ ఆలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ టైం లో కార్తిక్ తో ఓ అభిమాని అన్నయ్యా వదిన వస్తుందని అంటాడు. అయితే అది విన్న సారా ఎవర్రా నీకు వదినా అంటూ అతని వెంట పడుతుంది. అయితే ఇదంతా సరదాగా అనిపించినా ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

హీరోయిన్ గా విశ్వప్రయత్నాలు చేస్తున్న సారా ఆలి ఖాన్ మంచి ఫలితాలనే అందుకుంటుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ ఆజ్ కల్ మాత్రం నెగటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ వస్తుంది. మరి సారా ఖాన్ ఖాతాలో ఒక ఫ్లాప్ సినిమా పడినట్టే అనిపిస్తుంది.

అభిమాని చేసిన పనికి ఉరికించిన స్టార్ హీరో కూతురు..
0 votes, 0.00 avg. rating (0% score)