శృతిహాసన్ కు  సర్జరీ..నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్..!

February 28, 2020 at 6:39 pm

శృతి హాసన్‌ విలక్షణ నటుడు కమల్హాసన్ సినిమాలకు ఎంట్రీ ఇచ్చినా తన నటన, విభిన్న ప్రతిభతో తెలుగు తమిళ భాషాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. రెండు బాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. విక్టరీ వెంకటేష్, తండ్రి కమల్ హిసన్ నటించిన ఈనాడు చిత్రానికి సంగీతాన్ని కూడా అందించింది. పలు సినిమల్లోనూ పాటలు పాడి అలరించింది. అయితే ఇటీవల కొద్దికాలంగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ చిత్రంలో నటించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్ళకుల ముందుకు రానున్నది. తాజాగా ఈ బ్యూటీ ఓ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని ఆ భామనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ భామ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను  పోస్ట్ చేసింది. వాటిపై నెటిగన్లు తెగ కామెంట్లు చేశారు. క చాలా సన్నగా ఉంది అంటూ కారణం ఏంటని సందేహాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ అమె ఒక పోస్టును చేశారు. అంతేకాదు మిగతా ఆడవాళ్లు కూడా కనెక్ట్ అవుతారని అందుకే పోస్టు పెడుతున్నట్లు వివరించింది. తాను మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలను ఎదుర్కొంటున్నాని,  ఎన్నో ఏళ్ల పాటు హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని, ఆ బాధ భరించడం, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత సులువు కాదని చెప్పుకొచ్చింది. ఇంకా ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదని, తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాని,  అందుకు ఏమాత్రం సిగ్గుపడటంలేదని వివరించింది. తాను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదని, అలాగని వాటికి వ్యతిరేకించడం లేదని, మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యమని,  శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతామని తెలిపింది. అంతేకాదు రోజూ తణు తాను కాస్తా ఎక్కువ ప్రేమించుకోవడమే తన జీవితంలో తనకుండే  గొప్ప ప్రేమ కథగా భావిస్తానని,  మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నానని వెదాంత ధోరణిలో చెప్పింది. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శృతిహాసన్ కు  సర్జరీ..నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts