సాయి ధర్మ తేజ ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో

February 13, 2020 at 5:37 pm

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరోసారి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే ప్రతిరోజూ పండగే సినిమాతో తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన సాయి తేజ్…సోలో బ్రతుకే సొ బెటర్ అంటూ మరో సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే దర్శకుడు పరిచయమవుతుండగా, థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా నభా నటేశ్ కనిపించనుంది. ఇక బ్యాచిలర్ లైఫ్ లోనే అసలైన కిక్ వుంది అనుకునే కథానాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన థీమ్ వీడియో బట్టి చూస్తే సోలో బ్రతుకే సొ బెటర్ అనే టైటిల్‌కు తగ్గట్టుగానే ఉంది. వీడియో ప్రారంభమవ్వడమే, పెళ్లిళ్లు చేసుకోకుండా లైఫ్‌లో సక్సెస్ అయిన వాజ్‌పేయి, మథర్ థెరీసా, లతా మంగేష్కర్, అబ్దుల్ కలామ్, ఆర్ నారాయణ మూర్తిల కటౌట్స్‌కు తేజ్ నమస్కారం చేసి, తర్వాత సింగిల్‌గా ఉన్న వారందరికి ఓ స్పీచ్ ఇస్తాడు. చివరికి మన గోల్ ఏంటి అని చెబుతూ, సోలో బ్రతుకే సొ బెటర్ అంటూ నినాదాలు చేస్తాడు.

సాయి ధర్మ తేజ ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts