ఎన్టీఆర్ కంటే ముందే చరణ్…ఎస్ ఎస్ రాజమౌళి

February 12, 2020 at 4:40 pm

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకున్న సంగతి అందరికి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. తొలుత జూలైలో విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్,

ఇప్పుడు సంక్రాంతికి మార్చింది. మధ్యలో దసరాకు కూడా విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినపడింది. అయితే సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో వాయిదా వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో రాజమౌళిపై అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ప్రభాస్ తో బాహుబలి సినిమా చేసిన సమయంలో కూడా ఇదే విధంగా ఏళ్ళకు ఏళ్ళు చేస్తూ వచ్చారు రాజమౌళి.

ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చేయడంతో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి గాను దర్శకుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారు, మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి సీతారామ రాజు లుక్ ని, మే లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొమరం భీమ్ లుక్ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరి గా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ కంటే ముందే చరణ్…ఎస్ ఎస్ రాజమౌళి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts