రాజమౌళికి మరో ఎదురుదెబ్బ… చరణ్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ ?

February 15, 2020 at 12:39 pm

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ చిత్రంలోని ఓ ఫొటో ప్రస్తుతం లీక్ అయింది. ఫ్యాన్స్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఫొటోలు కాని సన్నివేశాలు కానీ ఏవీ బయటకు రాకుండా జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జరిగేవి జరిగిపోతూనే ఉన్నాయి. అయితే రామ్చరణ్ అల్లూరిసీతారామరాజుగా ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫొటోని చూసిన ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొడుతూ హడావిడి చేసేస్తున్నారు. ఇంతకీ అది సెట్స్ నుండి లీక్ అయిందా లేక ఫ్యాన్స్ ఉత్సాహంతో వారికి వారే ఓ ఫొటోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఈ ఫొటోను చూస్తుంటే మాత్రం మెగాఫ్యాన్స్ అభిమానం కొద్ది తమ స్టైల్లో క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది. మరి దీని పై రాజమౌళి అయితే ఇంకా ఏమీ స్పందించలేదు. మొత్తానికి సినిమా విడుదలై వారి స్టిల్స్ వచ్చేవరకు కూడా మనవాళ్ళు ఆగలేకపోతున్నారు. ఇక ఈ చిత్రంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్గా నటిస్తున్నారు. డి.ఎ. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం ఉంది. కారణం రాజమౌళి వీరి పుట్టిన రోజులు కానుకగా ఫస్ట్ లుక్స్ విడుదల చేయాలని భావిస్తున్నాడట, ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టిన తేదీ మే 20కాగా, చరణ్ బర్డ్ డే మార్చ్ 27 కాబట్టి…ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరిగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు కూడా మన ఫ్యాన్స్ ఎక్కడా ఆగేటట్టు లేరుగా.

రాజమౌళికి మరో ఎదురుదెబ్బ… చరణ్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts