సుప్రీం నిర్ణ‌యం.. శ‌రాఘాత‌మా? టీడీపీ, వైసీపీల్లో తీవ్ర‌ చ‌ర్చ‌

February 15, 2020 at 12:22 pm

ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పార్టీల‌ది ప్రధాన భూమిక‌. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌ను పాలించ డంలోను, రాష్ట్రాల‌ను, దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్ల‌డంలోను రాజ‌కీయ పార్టీల‌ది, నేత‌ల‌దీ అత్యంత ప్ర‌ధాన‌మైన పాత్ర‌. గ‌తంలో అంటే స్వాతంత్య్రం సిద్ధించిన త‌ర్వాత ఓ ద‌శాబ్ద కాలం వ‌ర‌కు సొంత లాభం కొంత మానుకుని ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసిన నాయ‌కులు ఈ దేశంలో ఉన్నారు. బ‌హుశ ఈ స‌మ‌యంలోనే రాజ్యాంగం రాసిన నేప‌థ్యంలో నీతి మంతులు, నిజాయితీప‌రులు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌గ‌ల‌ర‌ని, వారికి మాత్రం ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భువులుగా కీర్తులు అందుకునేందుకు అర్హ‌త ఉంటుంద ని నాటి మేధావులు త‌ల‌పించి ఉంటారు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. దీని ప్ర‌కారం క్రిమిన‌ల్సు, అవినీతి పరులు, దోపి డీ ముఠాకు చెందిన వారు రాజ‌కీయాల్లో ప‌నికిరార‌ని, వారికి రాజ‌కీయ పార్టీలు కూడా టికెట్లు ఇవ్వ‌డం భావ్యం కాద‌ని నాయ‌కులు భావించారు. అందుకే ఆ చ‌ట్టాన్ని అంత ప‌క‌డ్బందీగా రూపొందించారు. అయి తే, రాను రాను ఈ ప‌రిస్థితి మారిపోయింది. పంచాయితీ వార్డు మెంబ‌రు కూడా రోల్స్ రాయ‌ల్స్ కారును కో రుకునే రాజ‌కీయాలు వ‌చ్చాయి. దీంతో ఉన్న‌వాడు మాత్ర‌మే ప్ర‌జానాయ‌కుడిగా.. వెలుగొందుతున్న ప‌రి స్థితి వ‌చ్చింది. ఎన్నిక‌ల్లో గెలుపు ఒక ప్ర‌ధాన క్ర‌తువుగా మారిపోయింది. ఆ త‌ర్వాత ఎంతసేవ చేశాం.. అనే దానిక‌న్నా ఎంత వెనుకేసుకున్నాం.. అనే విష‌య‌మే కీల‌కంగా మారిపోయింది.

ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా దేశంలోని అన్ని పార్టీలూ కూడా అభ్య‌ర్థి వ్య‌క్తిత్వంతో సంబంధం లేకుండా గెలుపు గుర్రం ఎక్క‌గ‌లిగితే చాలు అంటూ.. టికెట్లు ఇస్తున్నాయి. దీంతో నేర‌స్తుల‌కు రాజ‌కీయా లు ఓ వేదికగా మారిపోయాయ‌నేది అంద‌రూ అంగీక‌రించే విష‌యం. ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క డా అదే ప‌రిస్తితి కొన‌సాగుతోంది. టీడీపీ , వైసీపీల్లో నేరస్తులే రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వీరి లో క్రిమిన‌ల్స్‌, అవినీతి ప‌రులు, బ్యాంకుల‌ను దివాలా తీయించిన వారు కూడా ఉన్నారు. అయితే, తాజా గా సుప్రీం కోర్టు.. ఇలాంటివారిపై కొర‌డా ఝ‌ళిపించేందుకు రెడీ అయింది.

క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్న వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిర్ణయించారో వివరణ ఇవ్వడంతోపాటు ఆయా కేసుల జాబితాను రాజకీయ పక్షాలన్నీ తమ వెబ్‌సైట్లలో ఉంచాలని స్పష్టం చేసింది. ఎన్నికల్లో విజయం సాధించగలరన్న ఒకే ఒక్క కారణంతో నేర చరితులకు టిక్కెట్లు ఇచ్చామని పార్టీలు చెప్పజాలవని, వారి అర్హతలు, సమర్థత వంటి అంశాలను ప్రస్తావిస్తూ తగిన కారణాలు చూపాలని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్, జస్టిస్‌ రవీంద్రభట్‌ల బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ ప‌రిస్థితితో ఏపీలో రెండు ప్ర‌దాన పార్టీలు టీడీపీ,వైసీపీలు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డాయి. ఇప్పుడు మీరు దొంగ అంటే మీరు దొంగ అని వాదించుకోవ‌డం త‌ప్ప‌.. రెండు పార్టీల్లోనూ క‌నిపిస్తున్న పార‌ద‌ర్శ‌క‌త మాత్రం శూన్య‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

సుప్రీం నిర్ణ‌యం.. శ‌రాఘాత‌మా? టీడీపీ, వైసీపీల్లో తీవ్ర‌ చ‌ర్చ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts