ప్ర‌కాశం త‌మ్ముళ్ల ఆలోచ‌న ఇదే..?

February 22, 2020 at 12:56 pm

రాష్ట్రంలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయినా.. ప‌లు జిల్లాల్లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేక పోయినా.. ప్ర‌కాశం జిల్లాలో మాత్రం న‌లుగురు ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు సాధించారు. వీరికితోడు చాలా మంది సీనియ‌ర్లు కూడా పార్టీలో ఉన్నారు. అయితే, వీరంతా ప‌ది మాసాలు గ‌డిచినా.. ఇంకా ఎన్నిక‌ల ఫీల్ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. పైగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌న్నెత్తు మాట కూడా అన‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చాలా మంది వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కారును టార్గెట్ చేస్తే.. త‌మ భ‌విత‌వ్యం ఇబ్బంది ప‌డుతుంద‌ని వారు అనుకుంటున్నారు.

అదేస‌మయంలో టీడీపీ ఎలాగూ మునిగిపోయింది. ఇప్పుడు దానికోసం ప్ర‌య‌త్నించి చేతులు కాల్చుకోవ డం ఎందుకు? అని కూడా వారు ఆలోచిస్తున్నారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌రిస్థితిని బ‌ట్టి అప్పు డు చూసుకోవ‌చ్చ‌ని అనుకుంటున్నారు. దీంతో ప్ర‌కాశం టీడీపీలో ఒక‌విధ‌మైన స్త‌బ్ద‌త ఏర్ప‌డింది. ముఖ్యంగా ఎర్రగొండపాలెం, దర్శి, కందుకూరు నియోజకవర్గాలలో అయితే పార్టీ వ్యవహారాలు అస్తవ్యస్తం గా ఉన్నట్లు తెలుస్తోంది. కందుకూరులో పోతుల రామారావు టంగుటూరు, ఒంగోలులో ఎక్కువ సమయం ఉంటున్నప్పటికీ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు.

హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు దర్శికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు ఫోన్‌లో అందుబాటులో ఉంటున్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం శిద్దా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఇటీవల కాలంలో ఆ వైపుకి రాలేదు. ఒంగో లులో ఉండాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్‌ తనకున్న సమస్యలను చక్కబెట్టుకునేందుకు అటు హైదరాబాద్‌, బెంగళూరులలో ఎక్కువకాలం ఉంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ ముఖ్యనేతలందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపించటం లేదు.

కొన్ని నియోజకవర్గాలలో అసలు కార్యక్రమ నిర్వహణకే శ్రీకారం పలకకపోగా కొన్నిచోట్ల తూతూమంత్రంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత బుధవారం ఇక్క‌డ ప్ర‌జా చైత‌న్య యాత్ర‌ను ప్రారంభించి అనంత‌రం నిర్వహించే సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తనవద్ద ఉన్న సమాచారంతో నేతలను నిలదీసే అవకాశం లేకపోయినా భవిష్యత్తు కార్యక్రమాలపై సూటిగా సూచనలిచ్చి జిల్లాలో పార్టీ పునర్నిర్మాణ ం వైపు ఆలోచన చేస్తారా లేదా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

ప్ర‌కాశం త‌మ్ముళ్ల ఆలోచ‌న ఇదే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts