టీడీపీది వైసీపీ తీసుకుంది.. వైసీపీది టీడీపీ పంచుకుంది.. !

February 14, 2020 at 11:49 am

పంతం నీదా-నాదా.. సై!! అనేది తెలుగు సినిమాలో ఓ పాట‌. అయితే, ఇప్పుడు ఇదే మాట‌ను రాష్ట్రంలోని అధికార ప్ర‌తిప‌క్షాలు కూడా అనుస‌రిస్తున్నాయి. ఏ విష‌యాన్ని తీసుకున్నా.. పంతంతోనే అడుగులు ముందుకు వేస్తున్నాయి. పోక‌చెక్క‌తో నువ్వొక టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అంటూ ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో మాట‌ల యుద్ధం చేసుకుంటున్న అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నాయి. ఒక పార్టీపై మ‌రో పార్టీ పైచేయి సాధించేందుకు కూడా ప్ర‌య త్నాలు చేసు కుంటున్నాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కావొచ్చు.. జ‌గ‌న్ వ్యూహాలు కావొచ్చు.. విష‌యం ఏదైనా పైచేయి సాధించేం దుకు వైసీపీ, అంత‌క‌న్నా పైచేయి సాధించేందుకు టీడీపీలు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ ర‌గ‌డ ఢిల్లీని కూడా పాకింది. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ రాజ‌కీయాల్లోనూ పైచేయి సాధించేందుకు రెండు ఆపార్టీలూ పోటీ ప‌డుతున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు పోటీ ప‌డుతున్నారు. ఒక‌రి మాట పై మ‌రొక‌రు పైమాట సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో టీడీపీ పైచేయి సాధించింద‌నే చెప్పాలి. లేదా త‌న పంతం నెగ్గించుకుంద‌నే అనాలి. విష‌యంలోకి వెళ్తే.. పార్లమెంటు భవన్‌లో తాను కోరుకున్న గదిని దక్కించుకోవడంలో టీడీపీ విజయం సాధించింది.

పార్లమెంటరీ పార్టీ ఆఫీసు గదిని ఆ పార్టీ ఎంపీలు కోరుకున్నట్టుగానే వైసీపీకి చెందిన గది(111-బీ)ని కేటాయుంచారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ అదనపు డైరెక్టర్‌ సంజయ్‌ సేథీ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ గది(5)ని వైసీపీపీకి కేటాయించాలంటూ ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పట్టుబట్టి ఇటీవల కేటాయించుకున్నారు. దీనికి టీడీపీ నేతలు అడ్డుతగలడంతో ఈ వివాదం కొద్దినెలలుగా కొనసాగుతూ వస్తోంది. తమకు గదిని కేటాయించకుండా వైసీపీకి తమ గదిని కేటాయించారు కాబట్టి తమకు వైసీపీ ఇప్పటి వరకు ఉంటున్న గది(111-బీ)ని ఇవ్వాలని టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌ పట్టుబట్టారు.

దీంతో గత్యంతరం లేక వైసీపీకి చెందిన మూడో అంతస్తులోని 111-బీ గదిని కేటాయిం చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. అస‌లు గ‌దుల గోల‌కు కార‌ణం ఏంటంటే.. ఎంపీల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి పార్ల‌మెంటు భ‌వ‌న్ వారికి కార్యాల‌యం కేటాయిస్తారు. విశాఖ‌ల‌మైన నెంబ‌రు 5 గ‌దిని ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీకి కేటాయించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ భారీ ఓట‌మితో ముగ్గురు ఎంపీల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. దీంతో నెంబ‌రు 5 గ‌దిని ఆ పార్టీకి ర‌ద్దు చేసి, త‌మ‌కు కేటాయించాల‌న్న 22 మంది స‌భ్యుల‌న్న వైసీపీ అభ్య‌ర్థ‌న‌ను పార్ల‌మెంటు అధికారులు మ‌న్నించారు. సో.. మొత్తానికి టీడీపీ ఎంపీ గ‌ల్లా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి కింద‌ప‌డ్డా పైచేయి సాధించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

టీడీపీది వైసీపీ తీసుకుంది.. వైసీపీది టీడీపీ పంచుకుంది.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts