రానా, గోపిచంద్ సినిమాల టైటిల్స్ ఫిక్స్ చేసిన తేజ?

February 22, 2020 at 5:33 pm

ఒకప్పుడు చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సూపర్ హిట్లని అందించిన డైరక్టర్ తేజ చాలాకాలం విజయాలకు దూరమయ్యారు. ఇక మళ్ళీ ఆయన రానాతో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫామ్‌లోకి వచ్చేశారు. ఇటీవల కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో తెరకెక్కించిన సీత సరిగా ఆడకపోయిన, ప్రస్తుతం ఇద్దరు బడా హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమైపోయాడు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తేజ వరుసపెట్టి రెండు సినిమాలను ప్రకటించాడు. ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించాడు. ఇక వీటిల్లో ఒక సినిమాలో గోపిచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరితో తేజ ఏ సినిమా చేస్తున్నాడు అన్నది మాత్రం తెలియదు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని తేజ వెల్లడించాడు.

కాకపోతే సినిమా టైటిల్స్‌ని బట్టి అంచనా వేసుకుంటే రానా హీరోగా ‘రాక్షస రాజు రావణాసురుడు’ అనే సినిమాని, గోపీచంద్ హీరోగా ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

రానా, గోపిచంద్ సినిమాల టైటిల్స్ ఫిక్స్ చేసిన తేజ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts