అవకాశాల కోసం దర్శకుడి కుటుంబంలో చిచ్చు పెట్టిన యాంకర్…!

February 12, 2020 at 12:19 pm

బుల్లి తెర మీద, వెండితెర మీద అవకాశాల కోసం హీరోలు, హీరోయిన్లు, నటులు ఎన్ని ప్రయత్నాలు కావాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం వస్తే చాలు తమను తాము నిరూపించుకుంటాం అనుకుంటారు వాళ్ళు. కాని అవకాశం రావడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంతో పోటీ ఉంటుంది. రంగుల ప్రపంచంలో మేకప్ వేసుకోవాలి అంటే రాసి పెట్టి ఉండాలి అంటూ ఉంటారు.

ప్రస్తుతం టాలివుడ్ లో టాప్ యాంకర్లు గా ఉన్న అనసూయ, రేష్మీ, సుమ, ఝాన్సీ, శ్రీ ముఖి సహా మరికొందరు అంత సులువుగా ఆ స్థాయికి రాలేదు అనేది వాస్తవం. ఇక తాజాగా ఒక విషయం టాలివుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మొన్నా మధ్య ఒక షో ద్వారా కాస్త సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక కుర్ర యాంకర్, అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.

మరి ఎవరు సలహా ఇచ్చారో ఏమో గాని దర్శక నిర్మాతలను లైన్లో పెడితే అవకాశాలు వస్తాయని ఆమెకు ఎవరో చెప్పారట. దీనితో ఒక్క కుర్ర దర్శకుడిని బుట్టలో వేసింది ఆ కుర్ర యాంకర్. పెళ్లి అయి ఈ మధ్యే కాపురం పెట్టిన ఆ దర్శకుడు కాస్త పాపులర్ కూడా అయ్యాడు. టాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళింది అని సమాచారం.

సదరు యాంకర్ గారి వలన దర్శకుడి గారి భార్య గారితో కూడా మనస్పర్ధలు రావడంతో పోలీసు స్టేషన్ కి వెళ్ళగా అక్కడ గట్టి వార్నింగ్ ఆ అమ్మాయికి ఇచ్చారట. ఒకటి రెండు షోస్ లో చేసిన ఆ యాంకర్ ఇప్పుడు మరిన్ని అవకాశాల కోసం చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం టాలివుడ్ అగ్ర దర్శకులకు కూడా తెలిసి కెరీర్ మొదట్లో ఉన్నావ్ కాబట్టి ఇప్పుడు ఇవన్ని ఎందుకు అని సదరు దర్శకుడికి కాస్త మెత్తగా చెప్పారట.

అవకాశాల కోసం దర్శకుడి కుటుంబంలో చిచ్చు పెట్టిన యాంకర్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts