లక్షలు ఇస్తారు.. ఆ గంట చుక్కలు చూపిస్తారు..!

February 18, 2020 at 12:55 pm

సిని గ్లామర్ అంటే ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ ఉంటుంది. సినితారలు వస్తున్నారన్న వార్త తెలిస్తే చాలు తెర మీద చూసిన వాళ్లను ప్రత్యక్షంగా చూడాలని మనసు పరుగులుతీస్తుంది. ఫలానా స్టార్ హీరో మన ఏరియాకు వస్తున్నాడని తెలిస్తే చాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా వేలు కొద్ది అభిమానులు, ఆడియెన్స్ అతని కోసం ఎదురుచూస్తారు. వాళ్లు వచ్చి ఒక్క అభివాదం చేస్తే అదేదో తనని చూసి ప్రత్యేకంగా చెప్పినట్టుగా ఫీల్ అవుతారు. ఇది హీరోల వర్షన్. హీరోలు షూటింగ్స్ కోసమో లేక వేరే ఈవెంట్ ల కోసమో పబ్లిక్ లోకి వస్తారు.

కాని హీరోయిన్స్ అలా కాదు.. సినిమాలతో సంబందం లేకుండా ఈవెంట్లని.. షాప్ ఓపెనింగ్స్ అంటూ రెగ్యులర్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో చెక్కర్లు కొడుతూనే ఉంటారు. అయితే గంట, రెండు గంటల కార్యక్రమం కోసం వీళ్లు లక్షల్లో డిమాండ్ చేస్తారు. అయితే లక్షలు ఇచ్చినా సరే ఏదైనా షాప్ ఓపెనింగ్ అని వెళ్తే.. అక్కడ కారు దిగిన దగ్గర నుండి మళ్లీ కారు ఎక్కేవరకు అందరు ఒత్తేస్తారని.. ఆ గంట చుక్కలు కనబడతాయని అంటున్నారు కొందరు హీరోయిన్స్.

ఒక షాప్ ఓపెనింగ్ కు హీరోయిన్ డిమాండ్ ను బట్టి 3 నుండి 5 లక్షల దాకా తీసుకుంటారని తెలుస్తుంది. ఆ హీరోయిన్ మేనేజర్ ఈ షెడ్యూల్స్ చూసుకుంటారు. గంటకు లక్ష రావడం ఓకే కాని అక్కడ ఆ రద్దీలో ఎవరు ఎక్కడ చేయి వేస్తారో ఎవరు ఏం చేస్తారో నిరంతరం గమనిస్తూనే ఉండాలని అంటున్నారు. అందుకే ఈ కష్టం అంతా పడతం దేనికని కొందరు ఎంత ఆఫర్ ఇచ్చినా సరే షాప్ ఓపెనింగ్స్ కు అసలు ఒప్పుకోరు. మరి డబ్బు కోసం ఒప్పుకోవదం ఆ తర్వాత బాధపడటం ఎందుకని కొందరి వాదన.

లక్షలు ఇస్తారు.. ఆ గంట చుక్కలు చూపిస్తారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts